AP News: జగన్ భూసంతర్పణ రాష్ట్రాన్ని గుల్ల చేస్తోంది.. లంకా దినకర్ షాకింగ్ కామెంట్స్! ఏపీ సీఎం జగన్ పవర్ ప్రాజెక్టులపేరుతో భూసంతర్పణ చేశారని బీజేపీ నేత లంకా దినకర్ ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా విలువైన భూములను పలు కంపెనీలకు నామమాత్రపు ధరకు ధారాదత్తం చేశారంటూ మండిపడ్డారు. దోపిడీలు చేసి సంపాదించిన సొమ్మంతా ఎన్నికల్లో విచ్చల విడిగా పంచిపెట్టారని అన్నారు. By srinivas 29 May 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి Vishaka: పవర్ ప్రాజెక్టులపేరుతో జగన్ భూసంతర్పణ చేశారని బీజేపీ రాష్ట్రఅధికార ప్రతినిధి లంకా దినకర్ ఆరోపించారు. షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్, ఇండోసోలార్ సంస్ధలకు భారీఎత్తున భూములు కట్టబెట్టారని చెప్పారు. ఎమ్వోయూలు చేసుకోకుండా జీఓలు ఇచ్చిన ఘనత జగన్ సర్కారుదని విమర్శించారు. జగన్ తన అస్మదీయులకు చేస్తోన్న భూసంతర్పణ రాష్ట్రాన్ని గుల్ల చేస్తోందని, పోడు పట్టాభూములను కూడా అధికారికాన్ని అడ్డం పెట్టుకుని బదలాయించుకున్నారన్నారు. జూన్ 4న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాబోతోందని, భూములపేరుతో జరిగిన అవినీతి, అక్రమాలపై దోషులను శిక్షించాలని కోరుతామన్నారు. సిఎస్ తనయడు పేరు మీదే భూదోపిడీలు జరుగుతున్నాయి. పవర్ ప్రాజెక్టుల పేరుతో భూదోపిడీలో రెచ్చిపోయారు. జగన్ 4 లక్షల ఎకరాల భూమిని అస్మదీయులకు కట్టబెట్టారు. షిరిడీ సాయి ఎలక్టవిశ్వేశ్వరరెడ్డి తో క్విడ్ ప్రోకోతో భూములను కట్టబెట్టారు. ఏక్ససె ఎనర్జీ ప్రైవేటు లిమిటెడ్ ఆగడాలను కూడా ప్రశ్నించాం. దానిపై ఈఆర్సీ అడ్డుకట్ట వేసింది. కర్నూల్ అనంతపూర్, కడప జిల్లాల్లో 32 వేల ఎకరాలను షిరిడీసాయి, ఇండో సోలార్ కంపెనీలకు నామమాత్రపు ధరకు ధారాదత్తం చేశారంటూ మండిపడ్డారు. భారీ ఆర్ధిక మోసాలకు తెరలేపారు.. ఏమాత్రం అనుభవం లేని సంస్ధలతో ఎమ్వోయూలు ఎలా చేసుకున్నారు. 500 కోట్లు మించి టర్నోవర్ లేని సంస్ధలకు వేల కోట్ల భూమలను ఎలా కట్టబెడతారు. దీనిపై ఆడిట్ చేయాలి. ఇలాంటి కంపెనీలు భూములు విలువ ఆధారంగా మూల్యాంకనం ఎక్కువగా చూపించి అంతర్జాతీయ విపణిలోకి ప్రవేసించే ప్రమాదం ఉందన్నారు. అధిక పెట్టుబడులను ఆకర్షించే భారీ ఆర్ధిక మోసాలకు తెరలేపే ప్రమాదముందన్నారు. ప్రాజెక్టు అనుమతులకోసం చేసిన అకృత్యాలను రాబోయే ప్రభుత్వం నిగ్గుతేల్చాలని డిమాండ్ చేశారు. విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు, మీటర్లు , పోల్స్ రాబోయే ఐదేళ్లకి అత్యధిక ధరలకు సరఫరా చేసే ఒప్పందాన్ని ఎలా కుదుర్చుకున్నారని చెప్పారు. ఇలాంటి బినామీ కంపెనీలపై ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలన్నారు. అక్రమాలకు వెన్నుదన్నుగా నిలిచిన అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. కార్యనిర్వహక రాజధాని అన్నారు. రుషికొండను బోడిగుండు చేసి.. తర్వాత పరిపాలనా అవసరాలకు భవనాలు నిర్మిస్తున్నామన్నారు. భూమాఫియాను విచ్చలవిడిగా ప్రోత్సహించిన ఘనత ఇక్కడ వైసిపి ప్రజాప్రతినిధులది. కరోనా సమయంలో భూదోపిడీలు యదేఛ్చగా చేశారు. ఏమాత్రం ఆక్యుపెన్సీ లేకుండా కడప నుంచి విశాఖకు విమానసర్వీసులు ఎందుకు నడిపారు? కడప నుంచి ముఠాలు విశాఖ వచ్చి భూ సెటిల్మెంట్లు చేసుకోడానికా? రుషికొండను బోడిగుండు చేసిన ఉదతం నుంచి తీరం వెంబడి వున్న భూములను, నగరంలో భూములను దోచుకున్నారు. దసపల్లా భూముల వెనుక వున్న అరాచకం నిగ్గుతేలాలన్నారు. మాన్సాస్ ట్రస్ట్ భూములను కొట్టేయాలని చూశారని, సిఎస్ తనయుడు భూదోపిడీలపై వాస్తవాలు బయటకు రావాలని అన్నారు. విశాఖలో భారీ ఎత్తున భూముల ఇన్ సైడ్ ట్రేడింగ్ చేశారంటూ నామమాత్రపు ధరలతో బెదిరించి లాగేసుకున్నారని ఆరోపించారు. భూదోపిడీలు చేసి సంపాదించిన నంతో ఎన్నికల్లో విచ్చల విడిగా డబ్బులు పంచిపెట్టారని, ఒక్కో నియోజకవర్గం పై వంద కోట్లు గుమ్మరించిన సొమ్ము దోచుకున్నదేనని వీటన్నింటి పై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. #ap-cm-jagan #lanka-dinkar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి