తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు (CM KCR) ఇటీవల వైరల్ ఫీవర్ సోకిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఆయనకు లంగ్ ఇన్ఫెక్షన్ సోకిందని మంత్రి కేటీఆర్ నిన్న స్వయంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ (DK Aruna) స్పందించారు. సీఎం కేసీఆర్ ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కేటీఆర్ తాను సీఎం అవ్వాలని కేసీఆర్ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. కేటీఆర్ సీఎం కావడానికి ఆయనని ఎం చేస్తారో అని మాకు భయంగా ఉందన్నారు అరుణ. సీఎం కు ఇంత అనారోగ్యంగా ఉంటే ఆసుపత్రిలో జాయిన్ చేయాలి కదా? అని ప్రశ్నించారు. మరి ఎందుకు ఫామ్ హౌస్ లో చికిత్స అందిస్తున్నారు? అని అనుమానం వ్యక్తం చేశారు. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తోన్న అభివృద్ధి కార్యక్రమాల్లో బావ, బావమరిది మాత్రమే పాల్గొంటున్నారు డీకే అరుణ. అనేక చోట్ల పనులు పూర్తి కాకున్న హడావుడిగా శంకుస్థాపనలు చేస్తున్నరని మండిపడ్డారు. ఇదంతా ఓట్ల కోసమే చేస్తున్నారు తప్పా... తెలంగాణపై చిత్త శుద్ధితో కాదని ధ్వజమెత్తారు.
ఇది కూడా చదవండి: Etela Rajender: ఈటల రాజేందర్ సంచలన హామి.. వారిలో ప్రతి ఒక్కరికీ 5 లక్షల రూపాయలు!
ఇదిలా ఉంటే.. సీఎం కేసీఆర్ గత మూడు వారాల నుంచి బయటకు రాకపోవడం, ఆరోగ్యంపై ఎలాంటి అప్‌డేట్ లేకపోవడంతో సర్వత్రా అయోమయం నెలకొంది. ఈ నేపథ్యంలోనే నిన్న మంత్రి కేటీఆర్ కీలక అప్‌డేట్ ఇచ్చారు. సీఎం కేసీఆర్ ఛాతిలో ఇన్‌ఫెక్షన్ ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు.
ప్రస్తుతం కేసీఆర్ విశ్రాంతిలో ఉన్నారని తెలిపారు. ఛాతిలో సెంకడరీ ఇన్‌ఫెక్షన్ వచ్చిందని తెలిపారు. కొద్ది రోజులుగా వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న సీఎం కేసీఆర్.. ప్రస్తుతం బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ రావడంతో మరింత ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఆయన కొలుకోవడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని తెలిపారు కేటీఆర్. ఈ విషయాన్ని ఓ మీడియా సంస్థకు వెల్లడించారు.