/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/bura-jpg.webp)
అటు కేంద్రంలో..ఇటు తెలంగాణలో బీజేపీ తన సత్తా చూపించడం ఖాయమన్నారు మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత బూరనర్సయ్య గౌడ్. బూత్ స్థాయి నుంచి ప్రధానమంత్రి వరకు ప్రతిఒక్కరూ ప్రచారంలో దూసుకుపోతున్నామని తెలిపారు. బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని ప్రకటించినప్పటి నుంచి బీజేపీ గ్రాఫ్ భారీ స్థాయిలో పెరుగుతుందన్నారు. అటు బీఆర్ఎస్, కాంగ్రెస్ పైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ పాలపొంగులాంటిదని..ఇవాళ పొంగుతుంది..రేపు కుంగుతుందంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ది బలం కాదు.. అది వాపు అంటూ విమర్శించారు. కాంగ్రెస్ లో ఎంతమంది గెలిచినా అంతా అమ్ముడుపోయేవారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. బూర నర్సయ్య గౌడ్ పూర్తి ఇంటర్వ్యూను ఈ కింది వీడియోలో చూడండి