BJP: నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తాం: కిషన్ రెడ్డి

తెలంగాణ ఎన్నికల్లో అనుకున్న ఫలితాలు సాధించలేకపోయినప్పటికీ, తమ ఓటు శాతం గణనీయంగా పెరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి అన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థులను ఓడించి తమ పార్టీ అభ్యర్థికి పట్టం కట్టిన కామారెడ్డి ప్రజలకు అభినందనలు తెలిపారు.

BJP: నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తాం: కిషన్ రెడ్డి
New Update

Kishan Reddy: తెలంగాణ ఎన్నికల్లో అనుకున్న ఫలితాలు సాధించలేకపోయినప్పటికీ, తమ ఓటు శాతం గణనీయంగా పెరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి అన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థులను ఓడించి తమ పార్టీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరెడ్డికి పట్టం కట్టిన కామారెడ్డి ప్రజలకు అభినందనలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు అవిశ్రాంతంగా శ్రమించారని, పార్లమెంటు ఎన్నికలకు ఇప్పటినుంచే సన్నద్ధమవుతామని ప్రకటించారు. జనసేనతో పొత్తు వల్ల నష్టం జరిగిందన్న వాదనలను ఖండించారు. నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రకు అంకితమవుతామన్నారు.

ఇది కూడా చదవండి: ప్రజా తీర్పును శిరసావహిస్తున్నా.. ఈటల రాజేందర్ ఎమోషనల్!

తమ పార్టీ అసెంబ్లీ స్థానాలు ఒకటి నుంచి 8కి పెరిగాయని, ఓట్లు 6.9 శాతం నుంచి 14 శాతానికి పెరిగాయని కిషన్‌ రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగింది తమ పార్టీకి మాత్రమే అన్నారు. రాజస్థాన్‌, చత్తిస్‌ఘడ్‌, మధ్యప్రదేశ్‌ లలో బీజేపీ ప్రభుత్వాల ఏర్పాటుపై కిషన్‌ రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పెద్దసంఖ్యలో స్థానాలను గెలుస్తామని ధీమా వ్యక్తంచేశారు.

ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ అభ్యర్థులు:

కామారెడ్డి - వెంకట రమణారెడ్డి, నిర్మల్ - మహేశ్వర రెడ్డి, ఆర్మూర్ - రాకేశ్ రెడ్డి, ముథోల్‌ - రామారావు పటేల్‌, నిజామాబాద్‌ అర్బన్‌ - ధనపాల్ సూర్యనారాయణ గుప్త, ఆదిలాబాద్ - పాయల్ శంకర్, గోషామహల్‌ - రాజాసింగ్, సిర్పూర్ - పాల్వాయి హరీశ్‌.

#kishan-reddy-bjp #bjp-telangana #katipally-venkata-reddy
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe