తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయం: ఈటల

సొంత పార్టీ నాయకులే సీఎం కేసీఆర్‌ ప్రవర్తన సరిగా లేదని అసహ్యించుకుంటున్నారని బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. ప్రగతి భవన్ కేంద్రంగా జరుగుతున్న కుట్రలు, కుతంత్రాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టాలని కేటీఆర్‌కు విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు.

New Update
తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయం: ఈటల

BJP is sure to win Telangana elections Etala

సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ఈటల మీడియాతో మాట్లాడిన ఈటల. మహారాష్ట్ర, పంజాబ్, హరియాణాల్లో అబ్‌కీ బార్ కిసాన్ సర్కార్ అని కేసీఆర్‌ చెప్పే మాటలకు తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా హుజూరాబాద్ ఫలితమే పునరావృతం అవుతుందని ఈటల ధీమా వ్యక్తం చేశారు.

ముందు ఇక్కడ అభివృద్ధి చేయ్

తెలంగాణ ప్రజలు అన్నమో రామచంద్ర అంటూ అఘోరిస్తుంటే ఎక్కడో మహారాష్ట్ర, పంజాబ్ , హర్యానా అబ్కి బార్ కిసాన్ సర్కార్ అని చెప్పే మాటలు చూస్తూ తెలంగాణ ప్రజలు నవ్వు కుంటున్నారు. ఇప్పటికైన ముఖ్యమంత్రిని బీఆర్ఎస్‌ గంగల పోను ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు మాట్లాడితే కండ్లు కనిపిస్తా లేవు శస్త్ర చికిత్స చేయిస్తామని చెప్తారు. కండ్లు మెదడు మాకు కాదు పనిచేసేది మీకు పనిచేయడం లేదు. అధికారం నెత్తి కెక్కి కండ్లు బైర్లు కమ్మినాయని మండిపడ్డారు.

బీఆర్ఎస్‌ తప్పుగా ప్రచారం చేస్తోంది

ఓ వ్యక్తి జడల బర్రెలను తన్నుతూ వాహనంలో ఎక్కించే వీడియోకు బీజేపీ తెలంగాణ నాయకత్వానికి ఇలాంటి ట్రీట్‌మెంట్‌ అవసరమని జితేందర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యానం చర్చనీయాంశమైంది. ఈ ట్వీట్‌ను బీజేపీ అగ్రనేతలు అమిత్‌షా, బి.ఎల్‌.సంతోష్‌, సునీల్‌బన్సల్‌కు ట్యాగ్‌ చేశారు. ఇది దుమారం కావడంతో ఆయన మరో ట్వీట్‌ చేశారు. తన అభిప్రాయాన్ని బీఆర్ఎస్‌ నేతలు తప్పుగా ప్రచారం చేస్తున్నారు. బండి సంజయ్‌ నాయకత్వాన్ని ప్రశ్నించేవాళ్లకు ఎలాంటి ట్రీట్‌మెంట్‌ ఇవ్వాలో చెప్పే ప్రయత్నం చేశానని పేర్కొన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు