/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/TDP-.jpg)
TDP Ministries:కేంద్రంలో టీడీపీకి పదవులపై చర్చలు కొలిక్కి వచినట్లు తెలుస్తోంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు కీలకంగా వ్యవరించిన చంద్రబాబుకు కాషాయ పార్టీ అధిష్టానం కీలక పదవులు ఇవ్వనున్నట్లు సమాచారం. రెండు కేంద్రమంత్రులు, ఒక సహాయ మంత్రి ఇస్తారనే టాక్ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. పౌర విమానయాన, వైద్య ఆరోగ్య శాఖలతోపాటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి టీడీపీకి ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.
అలాగే లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవి కూడా దాదాపు ఒకే అయినట్లు తెలుస్తోంది. పేర్లు, శాఖలు దాదాపు ఖరారయ్యారని ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది. టీడీపీ ఎంపీల్లో రామ్మోహన్ నాయుడికి పదవి ఖరారు అయినట్లు టాక్ వినిపిస్తోంది. మిగిలిన రెండు పదవులను ఎవరికి ఇస్తారనే ఆసక్తి నెలకొంది. రేసులో ఎంపీలు భరత్, లావు కృష్ణ శ్రీకృష్ణదేవరాయలు, పెమ్మసాని చంద్రశేఖర్, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, వేమిరెడ్డి, అమలాపురం ఎంపీ హరీష్‌కీ ఇస్తారని టాక్ నడుస్తోంది. దీనిపై మరికొన్ని రోజుల్లో అధికారిక ప్రకటన రానుంది.