CM Kejriwal: త్వరలో ముఖ్యనేతలు అరెస్ట్.. సీఎం కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికల తరువాత తమ పార్టీలోని ముఖ్యనేతలను జైలుకు పంపేందుకు బీజేపీ కుట్ర చేస్తుందని ఆరోపించారు. అలాగే తమ పార్టీ లేకుండా చేసేందుకు పార్టీ ఖాతాలను సీజ్ చేసేందుకు ఈడీ సిద్ధమైందని తెలిపారు.

New Update
CM Kejriwal: త్వరలో ముఖ్యనేతలు అరెస్ట్.. సీఎం కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

CM Kejriwal:ఈరోజు ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం ఎదుట ఆప్ నేతలను కేంద్ర దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ నిరసనలకు ఆప్ ఆద్మీ పార్టీ, సీఎం కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో అక్కడ ఏర్పాటు చేసిన సభలో సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతూ బీజేపీ పై సంచలన ఆరోపణలు చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకొని దేశంలో ప్రతి పక్షాలను, ప్రాంతీయ పార్టీలను లేకుండా చేయాలని బీజేపీ చూస్తోందని ఫైర్ అయ్యారు.

కేజ్రీవాల్ మాట్లాడుతూ.. "మనం పెద్దగా ఎదగకూడదని, వారికి సవాల్‌గా మారకూడదని బీజేపీ ‘ఆపరేషన్‌ ఝాదూ’ ప్రారంభించిందని, ‘ఆపరేషన్‌ ఝాదూ’ ద్వారా ఆప్‌ పెద్ద నేతలను అరెస్ట్‌ చేస్తారు, రాబోయే రోజుల్లో ఆప్ నేతలను అరెస్ట్ చేయడా ఖాయం. కొన్ని రోజులుగా ఆప్ బ్యాంకు ఖాతాలు స్తంభింపజేస్తామని ఈడీ తరపు న్యాయవాది ఇప్పటికే కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు.ఎన్నికల ముందు అలా చేస్తే మాకు సానుభూతి వస్తుందనే ఆలోచనలతో బీజేపీ లోక్ సభ ఎన్నికల తరువాత తమ ఖాతాలను స్తంభింపజేస్తుంది, మా కార్యాలయం క్లియర్ చేయబడుతుంది. మమ్మల్ని వీధుల్లోకి తీసుకువస్తుంది ఇవి బీజేపీ చేసిన 3 ప్రణాళికలు." అని అన్నారు.

Advertisment
తాజా కథనాలు