BJP Politics: వ్యూహామా.. తప్పిదమా..? బీజేపీలో గ్రూప్‌ పాలిటిక్స్!

బీజేపీలోకి కృష్ణ యాదవ్‌ చేరిక వాయిదా పడింది. చీకోటి ప్రవీణ్‌కు కూడా మరోరోజు జాయినింగ్‌ పెట్టుకోవాలని సూచించారు. హైదరాబాద్‌ సిటీతో పాటు కొన్ని అర్బన్‌ ప్రాంతాల్లో మినహయిస్తే బీజేపీకి క్షేత్రస్థాయిలో బలం తక్కువ ఉంది. బండి సంజయ్‌తో పాటు మరికొందరు నేతలు తీసుకొస్తున్న వాళ్లను పార్టీలో చేర్చుకోవడానికి కండీషన్స్‌ పెడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో బీజేపీ తెలంగాణ నేతల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన బండి సంజయ్‌ చీకోటి విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

BJP Politics: వ్యూహామా.. తప్పిదమా..? బీజేపీలో గ్రూప్‌ పాలిటిక్స్!
New Update

Group Politics in BJP: తెలంగాణలో అధికారంలోకి వచ్చేది తామేనని చెప్పుకుంటున్న బీజేపీ చేస్తున్న పొరపాట్లే ఆ పార్టీ ఎదగకపోవడానికి కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతుందా..? ఎలాంటి వ్యక్తి వచ్చినా కళ్లు మూసుకుని కండువా కప్పేసే స్థాయి నుంచి.. పార్టీలో చేరతామంటే వద్దని బ్రేకులు వేయడమే కాదు.. పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకున్న నాయకులకు నో జాయినింగ్‌ అని చెబుతుండడంతో తెలంగాణ రాజకీయాల్లో సర్వత్రా చర్చనీయాంశమవుతున్నాయి. హైదరాబాద్‌ సిటీతో పాటు కొన్ని అర్బన్‌ ప్రాంతాల్లో మినహిస్తే బీజేపీకి క్షేత్రస్థాయిలో బలం తక్కువనే విషయం బహిరంగ రహస్యమే. అలాంటి పార్టీకి చేరికలు ప్లస్‌ అవుతాయే తప్ప మైనస్‌ కావు. కాని ఇటీవల కాలంలో ఇద్దరు వ్యక్తులు పార్టీలోకి చేరకుండా బీజేపీ బ్రేకులు వేయడం సొంత పార్టీ నేతలనే విస్మయానికి గురిచేస్తోంది. బండి సంజయ్‌ను అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించి.. కిషన్‌రెడ్డి(Kishan reddy)కి ఆ బాధ్యతలు అప్పగించాక పార్టీలో చేరికల విషయంలో కొంత డైలామా నెలకొందనే వాదన వినిపిస్తోంది. బండి సంజయ్‌తో పాటు.. మరికొందరు నేతలు తీసుకొస్తున్న వాళ్లను పార్టీలో చేర్చుకోవడానికి కండీషన్స్‌ పెడుతున్నట్లు తెలుస్తోంది.

ALSO READ: వ్యూహాత్మకంగా అడుగులేస్తోన్న మైనంపల్లి.. కాంగ్రెస్‌లోకి కీలక అనుచరుడు!

మరోసారి చూద్దాం:

తాజాగా అంబర్‌పేటకు చెందిన బీఆర్‌ఎస్‌ నాయకుడు, మాజీ మంత్రి కృష్ణయాదవ్‌(krishna yadav) పార్టీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. తన అభిమానులు ఫంక్షన్‌ హాల్‌కు చేరుకున్నారు. ఈలోపే పార్టీలో సీనియర్‌ నేతలు బిజీగా ఉన్నారు.. మరోసారి చూద్దాం అంటూ సమాచారం ఇవ్వడంతో ఆ నాయకుడితో పాటు.. ఆయన అభిమానులు కంగుతిన్నారు. కృష్ణయాదవ్‌ను పార్టీలోకి రావాలని ఈటల రాజేందర్‌ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. కాని అంబర్‌పేట కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం కావడంతో.. ఆయన చేరికకు కిషన్‌రెడ్డి బ్రేకులు వేశారనే ప్రచారం సాగుతోంది. త్వరలోనే చేరిక ఉంటుందని ప్రకటించినా.. కృష్ణయాదవ్‌ ఇప్పటి వరకు బీజేపీలో చేరలేదు. జస్ట్‌ కమ్యూనికేషన్‌ ప్రొబ్లమ్‌ వల్ల కృష్ణ యాదవ్‌ చేరిక వాయిదా పడిందని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు కమలం నేతలు. అసలు విషయం మాత్రం బయటపెట్టలేదు.

చీకోటికి షాక్‌:

అలాగే క్యాసినో కింగ్‌ చీకోటి ప్రవీణ్ బీజేపీలో చేరేందుకు రెడీ అయ్యి..సెప్టెంబర్‌ 12వ తేదీన ముహుర్తంగా పెట్టుకున్నారు. ఆరోజు వేలాది మంది అనుచరులతో ఊరేగింపు చేస్తూ.. బీజేపీ కండువా కప్పుకునేందుకు నాంపల్లిలోని పార్టీ ఆఫీసుకు చేరుకున్నారు. ఇంతలో చీకోటి(Chikoti praveen)కి షాకింగ్‌ న్యూస్‌ చెప్పింది బీజేపీ. సీనియర్‌ నేతలు బిజీగా ఉండటంతో మరోరోజు జాయినింగ్‌ పెట్టుకోవాలని సూచించారట బీజేపీ నాయకులు. అసలు చేరికలను ఇంతకీ ఎవరు అడ్డుకుంటున్నారనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. చీకోటి ప్రవీణ్ బండి సంజయ్‌తో సమావేశమై పార్టీలో చేరతానని చెప్పారు. సంజయ్‌ సైతం ఓకే చెప్పారు. కాని తీరా పార్టీలో చేరే సమయానికి నో చెప్పడంతో చీకోటి కోపం కట్టలు తెంచుకుంది. మరోవైపు బీజేపీ తెలంగాణ నేతల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన బండి సంజయ్‌ చీకోటి విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. మొత్తానికి చేరికలను అడ్డుకోవడంబీజేపీ వ్యూహామా లేదా తప్పిదమా అనేది తేలడం లేదు. పార్టీ నేతల తీరుపై సొంత పార్టీ నాయకులే విస్మయం వ్యక్తం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.



ALSO READ: ఢిల్లీ లిక్కర్ కేసులో మరో సంచలనం.. అప్రూవర్‌గా మారిన రామచంద్రన్ పిళ్ళై

#bjp-politics #ts-elections-2023
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe