BJP Ticket Fight: ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్(BRS), కాంగ్రెస్(Congress) ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించి ప్రచారాల్లో దూసుకుపోతున్నాయి. జనసేనతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తామని తెలిపిన బీజేపీ(BJP) అధిష్టానం 119 స్థానాలకు 8 స్థానాలను జనసేనకు(Janasena) ఇచ్చి.. నాలుగు విడతల్లో 100 అభ్యర్థులను ప్రకటించింది. అయితే మిగిలిన 11 స్థానాల్లో పోటీచేసే అభ్యర్థులను మాత్రం బీజేపీ ఇంకా ప్రకటించలేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే తమ 8మంది అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. మేడ్చల్, మల్కాజ్‌గిరి, శేరిలింగంపల్లి, సికింద్రాబాద్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, నాంపల్లి, అలంపూర్, మధిర, నర్సంపేట, సంగారెడ్డి, పెద్దపల్లి నియోజకవర్గాల అభ్యర్థులను బీజేపీ ఇంకా ప్రకటించలేదు.
ALSO READ: మంత్రి కేటీఆర్‌కు ప్రమాదం.. గాయాలు..!
తెలంగాణ బీజేపీ ముఖ్యనేతలైన కిషన్ రెడ్డి, డీకే అరుణ, కొండా విశ్వేశర్ రెడ్డి ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తేల్చి చెప్పారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో టికెట్ రాని అసంతృప్తి నేతలను తమ పార్టీలోకి గుంజుకోవాలని బీజేపీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. రేపటితో నామినేషన్ల గడువు ముగుస్తున్న నేపథ్యంలో బీజేపీ అధిష్టానం ఆ 11 స్థానాల్లో ఎవరినీ తమ అభ్యర్థులుగా ప్రకటిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
ALSO READ: కాంగ్రెస్ కు బిగ్ షాక్.. బీఆర్ఎస్ లోకి మాజీ మంత్రి!
తెలంగాణపై బీజేపీ నజర్:
తెలంగాణ ఎన్నికల్లో బీజేపీని బలోపేతం చేసేందుకు బీజేపీ అధిష్టానం దూకుడుగా వ్యవహరిస్తోంది. వరుస కేంద్ర మంత్రుల పర్యటనలతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఒక్కరోజే తొమ్మది మంది కేంద్ర మంత్రులు తెలంగాణలోని పలు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాగూర్ మునుగోడు, పాలకుర్తిలో, మహేంద్ర నాథ్ పాండే ఇబ్రహీం పట్నం, వీకే సింగ్ కార్వాన్, అశ్విన్ కుమార్ చౌబే వరంగల్ వెస్ట్, అజయ్ భట్ ఉప్పల్, రావ్ సాహెబ్ పాటిల్ పఠాన్ చేరు, జితేంద్ర సింగ్ హుజురాబాద్, దేవ్ సింగ్ చౌహన్ రాజేంద్రనగర్, పురుషోత్తం రూపాల కొల్లాపూర్ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు.