BJP: ఈ రాత్రికే బీజేపీ తుది జాబితా విడుదల..మెనిఫెస్టో ఎప్పుడంటే

బీజేపీ ఇప్పటికే మొదటి, రెండవ విడుతల్లో 53 మంది అభ్యర్థులతో జాబితాలను విడుదల చేసింది. అయితే ఈరోజు రాత్రికి 20 నుంచి 23 స్థానలతో తుది జాబితా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈనెల 12 లేదా 13న మెనిఫెస్టోను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.

BJP: ఈ రాత్రికే బీజేపీ తుది జాబితా విడుదల..మెనిఫెస్టో ఎప్పుడంటే
New Update

BJP Final List: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఈనెల 30 ఎన్నికలు జరగనున్న సందర్భంగా అధికార, విపక్ష పార్టీలు దూకుడు పెంచేశాయి. బహిరంగ సభలు పెడుతూ జోరుగా ప్రచారాలు చేస్తున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలైన బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ నేతలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ (CM KCR) 115 నియోజకవర్గాలకు తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించేశారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు కూడా కొన్ని స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించాయి. కానీ ఇంకా పూర్తి జాబితాను ప్రకటించలేదు. బీజేపీ పార్టీ ఇప్పటికే రెండు విడతల్లో 53 మంది అభ్యర్థులను ప్రకటించింది. అయితే ఆదివారం రాత్రికి తుది జాబితా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. దాదాపు 20 నుంచి 23 స్థానాలతో తుది జాబితాను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Also Read: కామారెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థిగా రేవంత్‌ రెడ్డి!

తమ పార్టీ అభ్యర్థుల ఖరారు పూర్తి కావడంతో నేరుగా రాష్ట్ర నాయకత్వమే తుది జాబితాను ప్రకటించనుంది. ఇక రేపటి నుంచి కమలనాథులు ప్రచార ఘట్టంలోకి దిగనున్నాయి. ఈ ప్రచారాల్లో భాగంగా ప్రధాని మోదీ (PM Modi), కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా (Amit Shah), బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ సహా తదితర కేంద్ర మంత్రులు ఈ ప్రచారాల్లో పాల్గొననున్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తమ మెనిఫెస్టోను విడుదల చేసింది. అలాగే ఇటీవల కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను ప్రకటించింది. తుది మెనిఫెస్టో మరికొన్ని రోజుల్లో రానుంది. ఇక రాష్ట్ర బీజేపీ ఈనెల 12 లేదా 13వ తేదీన తమ మెనిఫెస్టో విడుదల చేయనున్నట్లు సమాచారం.

#telangana-elections-2023 #bjp-final-list #bjp
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe