నన్న ఓడించింది వాళ్లే.. అక్కడి నుంచి ఎంపీగా పోటీ చేస్తా: రఘునందన్ సంచలన ఇంటర్వ్యూ

ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో పోలీసులు తనపై కక్ష్య కట్టి ఓడించారని దుబ్బాక మాజీ రఘునందన్ రావు సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ నేతలు పోలీసుల సహకారంతో డబ్బులు పంచి గెలిచారన్నారు. ఈ విషయంపై డీజీపీకి ఫిర్యాదు చేశానన్నారు. మెదక్ ఎంపీగా బరిలోకి దిగుతున్నట్లు చెప్పారు.

New Update
నన్న ఓడించింది వాళ్లే.. అక్కడి నుంచి ఎంపీగా పోటీ చేస్తా: రఘునందన్ సంచలన ఇంటర్వ్యూ

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ ఎంపీగా బరిలో ఉంటానని దుబ్బాక మాజీ ఎమ్మెల్యే, బీజేపీ ఫైర్ బ్రాండ్ రఘునందన్ రావు (Raghunadan Rao) స్పష్టం చేశారు. ఆర్టీవీతో ఆయన ఈరోజు మాట్లాడుతూ.. నేషన్ ఫస్ట్ పార్టీ నెక్ట్స్ అనే పార్టీలో వ్యక్తి పూజ ఏంటని ప్రశ్నించారు. చేయి ఊపితే గెలుస్తామని చెప్పిన వారు ఎందుకు ఓడిపోయారన్నారు. తాను పార్టీ హైకమాండ్ కు మాత్రమే జవాబుదారీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రఘునందన్ రావు.
ఇది కూడా చదవండి: TS Free Power Scheme : తెలంగాణలో వారికి ఇక ఉచిత కరెంట్.. రూల్స్ ఇవే!

ఇటీవల జరిగిన ఎన్నికల్లో దుబ్బాకలతో తన ఓటమిపై స్పందిస్తూ.. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం అని అన్నారు. గతంలో తాను మెదక్ ఎంపీగా పోటీ చేసి మంచి ఓటింగ్ శాతం పొందానని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో మళ్లీ మెదక్ ఎంపీగా పోటీ చేస్తానన్నారు. ఎన్నికలకు ముందు చివరి మూడు రోజులు పోలీసుల సహకారంతో దుబ్బాకలో బీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచి గెలిచారని ఆరోపించారు. పోలీసులు తనపై కక్ష్య కట్టి ఓడించారన్నారు. ఈ విషయంపై డీజీపీకి కంప్లైంట్ చేసినట్లు చెప్పారు రఘునందన్.

Advertisment
తాజా కథనాలు