Telangana Elections: తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బీజేపీ బిగ్ లీడర్స్.. అమిత్ షా, యోగీ ఆదిత్య నాథ్, స్మృతీ ఇరానీ షెడ్యూల్ ఇదే!

తెలంగాణపై ఫోకస్ పెట్టిన బీజేపీ అధిష్టానం.. ప్రచార పర్వంలోకి అగ్రనేతలను దించేందుకు ప్లాన్ చేస్తోంది. 20న స్మృతీ ఇరానీ, 27న అమిత్ షా, 28న అస్సాం హిమంత బిశ్వ శర్మ రాష్ట్రంలో పర్యటించేలా షెడ్యూల్ విడుదల చేసింది బీజేపీ.

New Update
Telangana Elections: తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బీజేపీ బిగ్ లీడర్స్.. అమిత్ షా, యోగీ ఆదిత్య నాథ్, స్మృతీ ఇరానీ షెడ్యూల్ ఇదే!

తెలంగాణపై (Telangana Elections) ఫోకస్ పెట్టిన బీజేపీ అధిష్టానం.. ప్రచార పర్వంలోకి అగ్రనేతలను దించేందుకు ప్లాన్ చేస్తోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah), యూపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్, స్మృతీ ఇరానీ, అమిత్ షా, హింత బిశ్వ శర్మ ప్రచారంలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెలలో మొదటి విడతగా వీరు రాష్ట్రానికి రానున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ను బీజేపీ తాజాగా విడుదల చేసింది. 20వ తేదీన కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ తెలంగాణలో పర్యటించనున్నారు. 27న కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరో సారి రాష్ట్రానికి రానున్నారు. ఇంకా.. 28న అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సైతం రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. 31న యూపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.
ఇది కూడా చదవండి: Telangana Congress: నేటి నుంచి మూడురోజులు కాంగ్రెస్ బస్సు యాత్ర

ఇదిలా ఉంటే.. బీజేపీ ఫస్ట్ లిస్ట్ ఈ రోజు లేదా రేపు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆ పార్టీ సీనియర్ నేతలు బండి సంజయ్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్ తదితరులు ఈ రోజు ఢిల్లీ వెళ్లి పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీతో సమావేశం కానున్నారు. ఈ సమావేశం అనంతరం పార్టీ నుంచి రానున్న ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ ను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఫస్ట్ లిస్ట్ లో కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదితర అగ్రనేతల పేర్లు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏపీలో ఇప్పటికే జనసేనతో బీజేపీకి పొత్తు ఉన్న నేపథ్యంలో తెలంగాణలోనూ వారు కలిసి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకటి లేదా రెండు రోజుల్లో వీరి పొత్తుపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని సమాచారం.

Advertisment
తాజా కథనాలు