Politics: కాంగ్రెస్, బీజేపీ మధ్య 'సోషల్' వార్.. జుమ్లా బాయ్ Vs రావణ్

దేశంలో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రస్తుతం సోషల్ మీడియా వార్ జరుగుతోంది. మోదీని జుమ్లా బాయ్ అంటూ కాంగ్రెస్ వారు పోస్టర్ విడుదల చేయగా.. రాహుల్ పై రావణ్‌ పోస్టర్ ను విడుదల చేసింది బీజేపీ.

New Update
Politics: కాంగ్రెస్, బీజేపీ మధ్య 'సోషల్' వార్.. జుమ్లా బాయ్ Vs రావణ్

బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రస్తుతం పోస్టర్ వార్ జరుగుతోంది. మోదీని (PM Modi) జుమ్లా బాయ్ అంటూ పోస్టర్ విడుదల చేసింది కాంగ్రెస్ పార్టీ (Congress Party). దీనికి కౌంటర్ గా రాహుల్ పై రావణ్‌ పోస్టర్ ను బీజేపీ (Telangana BJP) విడుదల చేసింది. రాహుల్ గాంధీపై (Rahul Gandhi) బీజేపీ విడుదల చేసిన పోస్టర్ తీవ్ర వివాదాస్పదంగా మారింది. బీజేపీ విడుదల చేసిన పోస్టర్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సికింద్రాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ కాంగ్రెస్ నేత అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో బీజేపీ ఆఫీస్ ముట్టడికి శ్రేణులు తరలివెళ్లాయి.
ఇది కూడా చదవండి: Telangana Elections: ఈసారి ఫిక్స్.. తెలంగాణలో అధికారంపై బీఎల్ సంతోష్ సంచలన కామెంట్స్..


రాహుల్ ముఖంతో రావణుడి పోస్టర్ ఉండడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. రాహుల్ గాంధీ రాముడికి, సనాతన ధర్మానికి, దేశానికి వ్యతిరేకి అంటూ బీజేపీ క్యాప్షన్ ఇవ్వడంపై కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. తుంద

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు