కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ, బీఆర్ఎస్‌ నాయకులు

కర్ణాటకలో కాంగ్రెస్ విజయం తర్వాత తెలంగాణపై అధిష్టానం ఘట్టిగా ఫోకస్ పెట్టింది. వరుసగా మీటింగ్‌లు..సభలతో మరింత దూకుడు పెంచింది టీ.కాంగ్రెస్. మొన్న ఖమ్మం సభతో కాంగ్రెస్‌కు ఇంకా బలం పెరిగింది. ఎలాగైనా తెలంగాణలో అధికారం సాధించాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే పలువురు నేతలు కాంగ్రెస్‌లోకి చేరుతున్నారు. 

New Update
కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ, బీఆర్ఎస్‌ నాయకులు

BJP and BRS leaders joined Congress

ఇదిలాంటే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో చొప్పదండి, వనపర్తి నియోజకవర్గాలకు చెందిన పలువురు బీఆరెస్, బీజేపీ నుంచి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి రేవంత్‌రెడ్డి కండువాలతో ఆహ్వానించారు. వనపర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పటిష్టతకు పార్టీ కార్యకర్తలు కలసికట్టుగా కృషి చేయాలన్నారు. జూబ్లీహిల్స్ నివాసంలో కాంగ్రెస్ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు రేవంత్‌రెడ్డి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు, ఘనపూర్ మండలానికి చెందిన తదితరులు పాల్గొన్నారు.

అధికారమే లక్ష్యం..

ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు ప్రజలు పట్టం కాట్టాలని ప్రజలని కోరారు. అంతేకాకుండా సీఎం కేసీఆర్‌ ప్రభుత్వంపై రెవంత్‌రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ఇవ్వడమే కాంగ్రెస్ చేసిన తప్పా అని ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కి వచ్చే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ని గెలపించి.. బీఆర్ఎస్‌కి బుద్ది చెప్పాలన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్ద దించడమే టీకాంగ్రెస్ లక్ష్యంమని రేవంత్‌రెడ్డి అన్నారు.

ఇక్కడ అభివృద్ధి లేదు
తెలంగాణ ప్రజల డబ్బులు తీసుకెళ్లి ఇతర రాష్ట్రాలకు పంచుతున్నారని బీఆర్ఎస్ ప్రభుత్వంపై రేవంత్‌రెడ్డి విమర్శలు చేశారు. ఇక్కడ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేనోళ్లు.. రైతులని పట్టించుకోలేనోళ్లు..నిరుద్యోగులని పట్టించుకోలేళ్లు ఇతర రాష్ట్రాలన్ని బాగుచేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు