Maheshwar Reddy : తెలంగాణ (Telangana) బీజేపీ (BJP) శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర రెడ్డి (Aleti Maheshwar Reddy) మీడియాతో చిట్ చాట్ చేశారు. యూ ట్యాక్స్ అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) మీద చేసిన ఆరోపణలకు తన దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయన్నారు. ఆయన స్పందించిన తర్వాత దీనిపై మాట్లాడతానన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి కౌంటర్ ఇచ్చే సీన్ లేదు అనుకుంటున్నానన్నారు. దీనిపై ఉత్తమ్ తో బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. చర్చకు తాను ఒక్కడినే వస్తానన్నారు. వాళ్లు ఎంత మంది అయిన రావచ్చన్నారు. చర్చలో నేను అడిగే ప్రశ్నలకు ఉత్తమ్ సమాధానం ఇస్తే చాలన్నారు. తాను వార్తల కోసమే మాట్లాడాను అని అంటున్నారని.. కానీ గతంలో ఆర్ ట్యాక్స్, బీ ట్యాక్స్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద మాట్లాడినప్పుడు ఉత్తమ్ ఎందుకు ఏమీ మాట్లాడలేదని ప్రశ్నించారు. సివిల్ సప్లై లో వెయ్యి కోట్ల లంచాల అవినీతి జరిగిందన్నారు. కలెక్షన్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాత్ర ఉందని ఆరోపించారు. అదిలాబాద్ పార్లమెంట్ స్థానంలో లక్ష మెజారిటీ తో గెలుస్తామన్నారు.
Also Read : ఏసీపీ ఉమామహేశ్వర్‌రావుకు జూన్ 5 వరకు జ్యుడీషియల్ రిమాండ్