Biryani : రూ. 2 లకే నాయుడి గారి కుండ బిర్యానీ..ఎక్కడో తెలుసా! కేవలం 2 రూపాయలకే హైదరాబాద్ బిర్యానీ అందిస్తామంటుంది నాయుడి గారి కుండ బిర్యానీ. రూ. 2 నోటు ఇస్తే..కేపీహెచ్బీ, గచ్చిబౌలి, దిల్సుఖ్ నగర్ లలో ఉన్న బ్రాంచీలలో ఈ ఆఫర్ వర్తింస్తుందని యాజమాన్యం తెలిపింది. By Bhavana 12 Dec 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Hyderabadi Kunda Biryani : బిర్యానీ (Biryani) పేరు చెప్పగానే ఎవరికైనా నోరూరిపోతుంది. అలాంటి బిర్యానీ తినాలంటే వందల రూపాయాలు వెచ్చించాల్సి వస్తుంది. కానీ పసందైన బిర్యానీ కేవలం రూ. 2 కే (2 rupees) ఆస్వాదించవచ్చు అంట. ఈ ఆఫర్ ఇస్తుంది మరెవరో కాదు...హైదరాబాద్ లో ఫేమస్ నాయుడిగారి కుండ బిర్యానీ (Naidu Gari Kunda Biryani) యాజమాన్యం. కానీ ఇక్కడ ఓ మెలిక పెట్టారు నిర్వాహకులు. ఏ మెలిక లేకుండా రూ.2 లకే బిర్యానీ ఎలా తినేద్దాం అనుకున్నారు మరి. ఇంతకీ ఆ మెలిక ఏంటో తెలుసా..రూ. 2 నోట్ ని తీసుకుని వచ్చిన వారికి మాత్రమే ఈ అవకాశం అంటూ రెస్టారెంట్ నిర్వాహకులు తెలిపారు. 2 రూపాయాల నోట్ ఇవ్వండి మీకు నచ్చిన వెజ్ కానీ, నాన్ వెజ్ బిర్యానీ కానీ తిని వెళ్లండి అంటూ ఊరిస్తుంది. నగరంలో నెల రోజుల కిందట ఈ రెస్టారెంట్ ని ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఆఫర్ ప్రకటించినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు రూ. 2 నోట్లు 120 వచ్చాయని వివరించారు. ప్రజల వద్ద రూ. 2 నోట్లు ఉన్నాయా? లేదా తెలుసుకునేందుకు ఈ ఆఫర్ని ప్రారంభించామని దీనికి విశేషమైన స్పందన వస్తుందని యాజమాని మనోహర్ అన్నారు. కేపీహెచ్బీ, గచ్చిబౌలి, దిల్సుఖ్నగర్లలో ఉన్న బ్రాంచీలలో ఈ ఆఫర్ వర్తిస్తుందని యాజమాన్యం పేర్కొంది. నాయుడిగారి కుండ బిర్యానీ ఇలాంటి ఆఫర్లు ప్రకటించడం ఇదేమి మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా 30 కంటే ఎక్కువ వెరైటీలు ఉన్న బాహుబలి థాలీ తినాలని భోజన ప్రియులకు సవాల్ విసిరింది. అరగంటలోనే ఈ థాలీని తింటే కనుక లక్ష రూపాయలు అందిస్తామని తెలిపింది. ఈ ఛాలెంజ్ ఇప్పటి వరకు ఏడుగురు విజయం సాధించారు. హైదరాబాద్ అంటేనే బిర్యానీకి చాలా ఫేమస్. బిర్యానీ లవర్స్ ని దృష్టిలో పెట్టుకుని పలు రెస్టారెంట్లు సైతం ఆఫర్లను సైతం ఇస్తున్నాయి. Also read: గూగుల్లో ఎక్కువగా వెతికింది ఈ ముద్దుగుమ్మ కోసమేనట! #hyderabad #2-rs-biryani #naidugari-kunda-biryani మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి