Also Read: కాకినాడ జిల్లా గాడిమొగలో ఉద్రిక్తత.. టీడీపీ ప్రచారాన్ని అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు..!
గత మూడు సంవత్సరాల నుండి సర్పంచులు ఆందోళన చేస్తుంటే ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పందిస్తూ.. అసెంబ్లీలో ఆ నిధులను కరెంట్ బిల్లులకు బదలాయించామని అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో ఇది అవాస్తవమని ఖండించారన్నారు. సర్పంచుల నిధులు దారి మళ్ళించారని నిరూపించేందుకు చర్చకు సిద్ధమా అని సవాలు విసిరానన్నారు.
Also Read: వైసీపీ, ఎన్డీయే కూటమి మేనిఫెస్టోపై మాజీ మంత్రి జోగయ్య లేఖ..!
అయితే, మంత్రి బుగ్గన సమాధానం చెప్పలేక పోలీసులు, అధికారుల నుంచి తనకు నోటీసులు ఇప్పించాడని పేర్కొన్నారు. సర్పంచుల నిధులపై ఆందోళన చేయడానికి అనుమతి ఇవ్వాలని పోలీసులను కోరానని అయితే, పోలీసులు నిరాకరించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు, ఎమ్మెల్యేలు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తమ సవాల్ ను స్వీకరించలేదు కాబట్టి వారు తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టేనన్నారు. మూడున్నర కోట్ల గ్రామీణ ప్రజలకు మీరు చేసిన దొంగతనాన్ని అన్యాయాన్ని వివరించి సర్పంచుల సంఘం సత్తా చూపిస్తామని హెచ్చరించారు.