Face Tips: పక్షి గూడు పులుసు చాలా కాలంగా తయారవుతున్నప్పటికీ కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. ఇప్పుడు సోషల్ మీడియా చాలా వైరల్ అయింది. ఇప్పుడు ఇదంతా ఏమిటని మీరు ఆలోచిస్తున్నారా? ఆసియాలోని అనేక దేశాల్లో లాలాజలంతో గూడు కట్టుకునే పక్షి కనిపిస్తుంది. ఈ గూడు సూప్ చర్మ సంరక్షణ కోసం ప్రత్యేకమని చెబుతున్నారు. ఈ సూప్‌ను బర్డ్ ఎడిబుల్ నెస్ట్ సూప్ లేదా స్విఫ్ట్‌లెట్స్ నెస్ట్ అని కూడా పిలుస్తారు. ఈ సూప్ సౌత్ ఈస్ట్, ఈస్ట్ ఆసియాలో చాలా ఇష్టం. దాని గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
పక్షి గూడు నుంచి తయారైన సూప్:
స్విఫ్ట్‌లెట్‌లు తమ గూళ్లను ఈకలు, గడ్డితో తయారు చేయవు. ఈ పక్షి గూడు చాలా శుభ్రంగా, బలంగా ఉంటుంది. ఈ గూళ్లలో పోషక విలువలు, యాంటీ ఏజింగ్ వాల్యూస్ ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.
ఈ పక్షి గూళ్ళు ఎరుపు, తెలుపు, బంగారం, క్రీమ్ రంగులో ఉంటాయి. ఇవి వివిధ ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. అయితే.. ఈ గూడు చాలా ఖరీదైనది. 500 గ్రాముల గూడు ధర రూ.1.60 లక్షల వరకు ఉంది.
ఈ పక్షి గూడులో అమైనో ఆమ్లాలు, ప్రోటీన్లు, కాల్షియం, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉన్నాయని.. ఇవి కణాలను పునరుత్పత్తి చేయడంలో, మరమ్మత్తు చేయడంలో సహాయపడతాయని నమ్ముతారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: దేవునికి దీపం వెలిగించాలంటే ఈ నియామాలు పాటించాలి!