బర్డ్ ఫ్లూ రూపంలో మరో ముప్పు.. WHO కీలక హెచ్చరిక

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) H5N1 (ఏవియన్ ఇన్ఫ్లుఎంజా వైరస్)-బర్డ్ ఫ్లూ వ్యాప్తిపై హెచ్చరిక జారీ చేసింది. ఈ వైరస్ సోకిన మానవులలో మరణాల రేటు చాలా ఎక్కువగా ఉందని డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ జెరెమీ ఫర్రార్ తెలిపారు.

New Update
బర్డ్ ఫ్లూ రూపంలో మరో ముప్పు.. WHO కీలక హెచ్చరిక

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) H5N1 (ఏవియన్ ఇన్ఫ్లుఎంజా వైరస్)-బర్డ్ ఫ్లూ వ్యాప్తిపై హెచ్చరిక జారీ చేసింది. ఈ వైరస్ సోకిన మానవులలో మరణాల రేటు చాలా ఎక్కువగా ఉందని డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ జెరెమీ ఫర్రార్ తెలిపారు. ఈ రోజు వరకు మనిషి నుంచి మనిషికి ఈ వైరస్ సంక్రమించినట్లు ఎటువంటి నివేదికలు లేవు. కానీ వైరస్ ఇప్పటికే అనేక వందల మందికి సంక్రమించింది. H5N1 వైరస్ ప్రధానంగా పౌల్ట్రీ జంతువులు, బాతులకు సోకుతుంది. కానీ.. ఇప్పుడు ఈ రెండేళ్లలో ఇన్‌ఫ్లుఎంజా ఇన్‌ఫెక్షన్ జంతువుల మహమ్మారిగా మారిందని డాక్టర్ జెరెమీ చెప్పారు. ఆయన మాట్లాడుతూ.. ఈ వైరస్ గతంలో బాతులు, కోళ్లను ప్రభావితం చేసింది. అనంతరం క్షీరదాలను ప్రభావితం చేయడం ప్రారంభించింది. ఇప్పుడు వైరస్ మానవులకు సోకే సామర్థ్యాన్ని సంతరించుకుంది. వైరస్ త్వరలో ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి సంక్రమించే సామర్థ్యాన్ని కూడా పొందేలా రూపాంతరం చెందే అవకాశం ఉందన్నారు.

ప్రస్తుతం పాడి ఆవుల్లో.. భవిష్యత్ లో మానవాళికి..
యునైటెడ్ స్టేట్స్ లో ప్రస్తుతం పాడి ఆవులు H5N1 వైరస్ వ్యాప్తిని ఎదుర్కొంటున్నాయి. ఈ వైరస్ ఇప్పుడు వివిధ మార్గాల్లో వ్యాపించే సామర్థ్యాన్ని పెంపొందించుకునే అవకాశం ఉంది. దీంతో పాడి ఆవులను నిశితంగా పర్యవేక్షించాలని సీనియర్ WHO అధికారి ప్రజారోగ్య అధికారులకు సూచించారు. జంతువుల మధ్య వైరస్ ఎలా వ్యాపిస్తుందో తెలుసుకోవడం చాలా ముఖ్యమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇది ఇప్పటికీ రహస్యంగా ఉందని తెలిపారు.

డాక్టర్ జెరెమీ మాట్లాడుతూ.. "H5N1 మనుషుల్లో ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే సామర్థ్యాన్ని సులభంగా పెంపొందించుకోగలదని.. ఈ నేపథ్యంలో.. మానవులకు ఈ వైరస్ సోకకుండా చూసుకోవాలన్నారు. వ్యాక్సిన్‌లు, థెరప్యూటిక్స్, డయాగ్నస్టిక్‌లతో వెంటనే స్పందించడానికి సిద్ధంగా ఉండాలన్నారు. వివిధ దేశాల పబ్లిక్ హెల్త్ ఏజెన్సీల మధ్య సమన్వయం పెంచి.. అంతరాన్ని తగ్గించడానికి.. ఆఫ్రికా, చైనా, యూరప్, యునైటెడ్ స్టేట్స్‌కు చెందిన నాలుగు ప్రధాన ప్రజారోగ్య సంస్థలతో WHO చర్చలు జరిపింది.

డాక్టర్ ఫర్రార్ జెనీవాలో విలేకరులతో మాట్లాడుతూ.. "ఈ చొరవ మరింత సంక్లిష్టమైన, తరచుగా వచ్చే అంటువ్యాధులను ఎదుర్కోవటానికి అంతర్జాతీయ సమాజం యొక్క నిబద్ధతను బలపరుస్తుంది" అని అన్నారు.  HN51 వైరస్ ప్రమాదం గురించి WHO నిపుణుడు మాట్లాడుతూ..  వ్యాక్సిన్ ఇంకా అభివృద్ధి దశలోనే ఉందన్నారు. ఒక వేళ ఈ వైరస్ వ్యాప్తి చెందితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య కేంద్రాలు ఏవీ సరైన రోగ నిర్ధారణను అందించడానికి సిద్ధంగా లేవని ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisment
తాజా కథనాలు