Bima Vistaar: బీమా విస్తార్..ఇది ఆల్ ఇన్ వన్ సూపర్ సేవర్ ఇన్సూరెన్స్ బాస్! 

లైఫ్,హెల్త్, ఏక్సిడెంట్, ప్రాపర్టీ ఇలా అన్ని రకాల ఇన్సూరెన్స్ కవరేజీలను అందించే చౌకైన ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ ను భారత బీమా నియంత్రణ- అభివృద్ధి అథారిటీ (IRDAI) అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు. 

New Update
Bima Vistaar: బీమా విస్తార్..ఇది ఆల్ ఇన్ వన్ సూపర్ సేవర్ ఇన్సూరెన్స్ బాస్! 

Bima Vistaar: భారత బీమా నియంత్రణ- అభివృద్ధి అథారిటీ (IRDAI) భారతదేశంలోని గ్రామీణ వర్గాల కోసం సమగ్రమైన - సరసమైన ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ ను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ పేరు బీమా విస్తార్ . దీనిని  ఒక సంచలనాత్మక ప్రోడక్ట్ గా చెప్పవచ్చు.  దీని ప్రీమియం ధర రూ. 1,500గా నిర్ణయించింది IRDAI. బీమా విస్తార్ సరసమైన - సంపూర్ణమైన బీమా కవరేజీని అందిస్తుంది.  గ్రామీణ జనాభాకు అవసరమైన ఆర్థిక రక్షణ అందుబాటులో ఉండేలా చూస్తుంది. IRDAI  ఈ సంచలనాత్మక చర్య భారతదేశంలో చాలా కమ్యూనిటీల ఇన్సూరెన్స్  అవసరాలను పరిష్కరించడంలో నిబద్ధతను ప్రదర్శిస్తుంది.  ఆర్థిక చేరిక అలాగే భద్రతను ప్రోత్సహిస్తుంది.

 లైఫ్,హెల్త్, ఏక్సిడెంట్, ప్రాపర్టీ ఇలా అన్ని రకాల ఇన్సూరెన్స్ కవరేజీలను బీమా విస్తార్ (Bima Vistaar)  అందిస్తుంది. దీని ధర - ఇతరవిషయాలను గురించి చర్చించడానికి బీమా నియంత్రణ-అభివృద్ధి అథారిటీ (IRDAI) అధికారులు అలాగే  బీమా కంపెనీల CEO లు ఇటీవల సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బీమా విస్తార్ కు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నారు. 

ఇది కూడా చదవండి: థియేటర్ లో సినిమా.. ఆ కిక్కే వేరబ్బా అంటున్న జనం.. ఈ లెక్కలపై ఓ లుక్కేయండి!

బీమా విస్తార్ ప్రీమియం వివరాలు ఇవే..
ప్రొడక్ట్‌లో రూ. 820 ప్రీమియంతో లైఫ్ కవర్, రూ. 500 హెల్త్ కవర్, రూ. 100 వద్ద పర్సనల్ యాక్సిడెంట్ కవర్ అలాగే రూ. 80 ప్రాపర్టీ కవర్ ఉన్నాయి. ఫ్లోటర్ ప్రాతిపదికన మొత్తం కుటుంబం కోసం తీసుకుంటే, పాలసీ ధర రూ. 2,420 అవుతుంది. మిగిలిన కుటుంబ సభ్యులకు అదనంగా రూ.900 వసూలు చేస్తారు. జీవిత, వ్యక్తిగత ప్రమాదం, ప్రాపర్టీ కవర్‌ల కోసం బీమా  మొత్తం రూ. 2 లక్షలుగా నిర్ణయిచారు. అయితే ఆరోగ్య కవరేజీని హాస్పి క్యాష్‌గా సూచిస్తారు. 10 రోజులకు రూ. 500 హామీ మొత్తాన్ని అందిస్తుంది. అంతేకాకుండా, విస్తృత స్వీకరణ - పంపిణీని ప్రోత్సహించడానికి, Bima Vistaar పాలసీలను విక్రయించే ఏజెంట్లు 10% కమీషన్‌కు అర్హులుగా నిర్ణయించారు. అంటే, బీమా విస్తార్ పాలసీలను విక్రయించే ఏజెంట్లు 10 శాతం కమీషన్ పొందుతారు. ఈ పాలసీని అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి ఏజెంట్లకు కమీషన్లు ఇవ్వాలని IRDAI యోచిస్తోంది. ఇన్సూరెన్స్ బ్రోకర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (IBAI) వైస్ ప్రెసిడెంట్ నరేంద్ర భరింద్వాల్ మాట్లాడుతూ, ఈ చొరవ ప్రజల రక్షణ మాత్రమే కాకుండా ఆర్థిక చేరికకు కూడా సహాయపడుతుందని అన్నారు. బీమా విస్తార్ అందించిన క‌వ‌రేజీకి ఉన్న ప్రాధాన్య‌త ప్ర‌త్యేక‌మ‌ని అన్నారు.

Advertisment
తాజా కథనాలు