Bima Sugam: ఇన్సూరెన్స్ నిబంధనలను ఈజీ చేయడానికి.. కస్టమర్లకు అనుకూలంగా ఉండేందుకు, బీమా నియంత్రణ- అభివృద్ధి ప్రాధికార సంస్థ (IRDAI) శుక్రవారం తన బోర్డు సమావేశంలో ఎనిమిది ముఖ్యమైన నియమాలను ఆమోదించింది. వీటిలో ‘బీమా సుగం’ వేదిక కూడా ఉంది. బీమా సుగం అంటే అన్ని రకాల ఇన్సూరెన్స్ లకు సంబంధించిన సమాచారం అందుబాటులో ఉండే ఎలక్ట్రానిక్ మార్కెట్ ప్లేస్ అని చెప్పవచ్చు. దీనివలన వినియోగదారులు ఒకే స్థలం నుండి ఏదైనా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే అవకాశం దొరుకుతుంది. ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని అనుకున్నపుడు ప్రస్తుతం మనం వివిధ రకాల కంపెనీల వెబ్సైట్లను వెతుకుతున్నాం. లేదా ఇన్సూరెన్స్ కంపెనీల ఏజెంట్లపై ఆధారపడుతున్నాం. ఇకపై ఆ అవసరం ఉండదు. ఒకే చోట అన్ని ఇన్సూరెన్స్ కంపెనీల.. అన్నిరకాల పాలసీలు బీమా సుగం(Bima Sugam) వద్ద అందుబాటులో ఉంటాయి. దీని కోసం, వారు వివిధ కంపెనీల వెబ్సైట్లను సందర్శించాల్సిన అవసరం లేదు లేదా ఏజెంట్ల సహాయం తీసుకోవలసిన అవసరం లేదు. ఇందులో ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు నుంచి రెన్యూవల్, క్లెయిమ్ సెటిల్మెంట్, పోర్టబిలిటీ నుంచి ఫిర్యాదుల పరిష్కారం వరకు సౌకర్యాలు ఉంటాయి. బీమా సుగమ్ పాలసీ హోల్డర్లందరికీ ‘ఎండ్-టు-ఎండ్’ డిజిటల్ సేవలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
పూర్తిగా చదవండి..Bima Sugam: ఈజీగా ఇన్సూరెన్స్ పాలసీలు.. చౌకగా దొరికే ఛాన్స్!
ఇన్సూరెన్స్ పాలసీలు సంబంధించి అన్ని సర్వీసులను ఒకే దగ్గర దొరికేలా బీమా సుగం డిజిటల్ మార్కెట్ ప్లేస్ అందుబాటులోకి తీసుకువచ్చింది బీమా నియంత్రణ సంస్థ IRDAI. బీమా సుగమ్ పాలసీ హోల్డర్లందరికీ 'ఎండ్-టు-ఎండ్' డిజిటల్ సేవలను అందిస్తుంది.
Translate this News: