Health Benefits: మద్యం అలవాటును మానిపించే అద్భుత మొక్క

మనకు అనేక ప్రాంతాల్లో బిళ్ల గన్నేరు మొక్క కనిపిస్తూ ఉంటుంది. కేవలం అలంకరణకే కాకుండా ఈ మొక్కలో మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. చాలా రకాల అనారోగ్య స‌మ‌స్యలు తగ్గించడంలో ఇది ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఏవైనా పురుగులు కుడితే ఈ ఆకుల రసం రాయడం వల్ల దద్దుర్లు తగ్గిపోతాయి.

New Update
Health Benefits: మద్యం అలవాటును మానిపించే అద్భుత మొక్క

Billa Ganneru Plant Health Benefits: సాధారణంగా మన ఇళ్లలో అనేక రకాల పూల మొక్కలను పెంచుతూ ఉంటాం. కొన్ని కేవలం అలంకారప్రాయంగా పెంచితే, మరికొన్ని మొక్కల పూలతో దేవుడికి పూజ చేస్తుంటాం. అలా ఇళ్లలో ఈజీగా పెంచుకోవడానికి బిళ్ల గన్నేరు మొక్క అనువుగా ఉంటుంది. ఈ మొక్క మనకు అనేక ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటుంది. కేవలం అలంకరణకే కాకుండా ఈ మొక్కలో మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. చాలా రకాల అనారోగ్య స‌మ‌స్యల‌ను తగ్గించడంలో ఇది ప్రముఖ పాత్ర పోషిస్తుంది. మనకు ఏదైనా గాయం అయితే ఈ మొక్క ఆకుల‌ను ముద్దగా చేసి గాయంపై పెట్టడం వల్ల రక్తం కారడం వెంటనే ఆగిపోతుంది. అంతేకాకుండా గాయం కూడా త్వరగా మానిపోతుంది.
ఇది కూడా చదవండి: ఆవాలతో ఇలా చేస్తే పట్టిందల్లా బంగారం అవుతుంది

మన శ‌రీరంలో వేడి ఎక్కువైతే ముక్కు నుంచి ఒక్కసారిగా వస్తుంటుంది. అలా జరిగితే బిళ్ల గ‌న్నేరు పువ్వులు, దానిమ్మ చెట్టు మొగ్గలతో కలిపి నూరుకోవాలి, ఆ రసాన్ని ముక్కు రంధ్రాల్లో 2 చుక్కలు వేసుకుంటే రక్తం కారడం ఆగిపోతుంది. ఈ రోజుల్లో చాలా మందిని మధుమేహం వేధిస్తూ ఉంటుంది. షుగర్‌ను కంట్రోల్‌ చేసే అద్భుత గుణాలు బిళ్ల గన్నేరు మొక్కలో ఉన్నాయి. షుగర్‌ ఉంటే ప్రతిరోజు ఉదయం పరగడుపునే రెండు ఈ మొక్క ఆకులు, పువ్వులను తింటే క్రమంగా షుగర్‌ మాయం అవుతుంది. అలాగే ఈ మొక్క వేరును శుభ్రం చేసుకుని ఎండబెట్టి పొడిచేసి రోజు రెండుసార్లు భోజనం తర్వాత ఒక అర స్పూన్‌లో తేనె కలిపి తీసుకుంటే షుగ‌ర్ తగ్గిపోతుంది. అంతేకాకుండా బీపీ, గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారు బిళ్ల గన్నేరు ఆకులను దంచి రసం తీసుకుని రోజుకు రెండు చెంచాలు తీసుకుంటే మంచిది. దీంతో బీపీ తగ్గిపోతుంది, గుండె సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.
మొటిమలు, మచ్చలు ఉంటే తగ్గుతాయి
అలాగే ర‌క్తనాళాల్లోని అధిక కొవ్వు కరిగిపోయి గుండెపోటు రాకుండా ఉంటుంది. జీర్ణక్రియకు కూడా ఈ మొక్క బాగా ఉపయోగపడుతుంది. జీవక్రియతో పాటు కడుపు ఉబ్బరం కూడా ఇది తగ్గిస్తుంది. బిళ్ల గ‌న్నేరు మొక్క ఆకుల ర‌సం తాగితే క్యాన్సర్లు కూడా మన దరి చేరవని నిపుణులు అంటున్నారు. బిళ్ల గ‌న్నేరు మొక్క యొక్క వేరు నుంచి ర‌సాన్ని తీసి తేనె కలుపుకుని తాగితే మందుతాగేవారు క్రమంగా అలవాటును మానుకుంటారు. మన ముఖంలో మొటిమలు, మచ్చలు ఉంటే ఈ మొక్క ఆకులతో పాటు వేప ఆకులు కలిపి పొడి చేసుకుని దానికి పసుపు, నీళ్లు కలిపి రాసుకుని గంట తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేస్తే మొటిమలు తగ్గిపోతాయి. మాన‌సిక ఒత్తిడి ఉన్నవారు ఈ మొక్క పూలతో రసం చేసి పడుకునే ముందు ఒక స్పూన్‌ తాగితే బాగా నిద్రపడుతుంది. వర్షాకాలంలో ఏవైనా పురుగులు మనల్ని కుడితే ఈ ఆకుల రసం రాయడం వల్ల దద్దుర్లు తగ్గిపోతాయని నిపుణులు అంటున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు