Bike Riding Tips: మీరు బైక్ నడుపుతున్నారా? అయితే, ఇవి తప్పకుండా తెలుసుకోండి.. బైక్ నడపడం ప్రతి ఒక్కరికీ ఇష్టమే. అయితే, ఆ బైక్ నడిపేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ జాగ్రత్తలను పాటించడం వలన ప్రమాద సమయంలో ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చు. బైక్ నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. జాకెట్, ఫుల్ ప్యాంట్, మంచి బూట్లు ధరించాలి. తద్వారా రైడర్ సేఫ్‌గా ఉంటుంది. By Shiva.K 31 Oct 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Bike Riding Security Tips: ప్రస్తుత కాలంలో ద్విచక్ర వాహనం(Two Wheeler) లేని వారు చాలా అరుదనే చెప్పాలి. కొందరు తమ అవసరాల కోసం కొనుగోలు చేస్తే.. మరికొందరు సరదాగా లాంగ్ డ్రైవింగ్(Long Driving) కోసం బైక్ కొనుగోలు చేస్తుంటారు. వాస్తవానికి బైక్‌పై లాంగ్ డ్రైవ్ చేయడం వలన కలిగే అనుభూతే వేరు. అందుకే.. చాలా మంది బైక్‌పై లాంగ్ డ్రైవ్స్‌కి వెళ్తుంటారు. అయితే బైక్ నడపడటం మనకు ఎంత ఆనందాన్ని ఇస్తుందో.. అంతకంటే ఎక్కువ భద్రతాపరమైన చర్యలు తీసుకోవడం ముఖ్యం. ఎంతటి ఎక్స్‌పీరియన్స్‌డ్ రైడర్ అయినా.. సెఫ్టీ విషయాలను తప్పక పాటించాల్సిందే. ఈ సేఫ్టీ టిప్స్ మీకు ఇష్టమైన బైక్‌ని కాపాడటంతో పాటు.. మీ ప్రాణాలను కూడా పాడుతుంది. మరి ఆ సేఫ్టీ అంశాలేంటో ఓసారి చూద్దాం.. హెల్మెట్ ధరించడం.. రైడర్ రక్షణలో హెల్మెట్ మొదటి వరుసలో ఉంటుంది. బైక్‌పై ప్రయాణించే రైడర్స్ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిందే. అకస్మాత్తుగా ఏదైనా ప్రమాదం జరిగితే.. హెల్మెట్ లైఫ్ సేవర్‌గా మారుతుంది. తలకు గాయాలు కాకుండా కాపాడుతుంది. అందుకే.. బైక్‌పై ప్రయాణం చేసే వారు తప్పకుండా హెల్మెట్ ధరించాలి. జాకెట్, ఫుల్ ప్యాంట్.. బైక్‌పై ప్రయాణించే వారు తప్పకుండా మందమైన, దృఢమైన జాకెట్, ఫుల్ ప్యాంట్ ధరించాలి. ఇది అనుకోని రోడ్డు ప్రమాదానికి గురైతే.. శరీరంపై గాయాలు అవకుండా మిమ్మల్ని కాపాడుతుంది. హ్యాండ్ గ్లౌవ్స్.. బైక్ నడిపే వ్యక్తులు.. చాలాసేపు రేసింగ్ చేయడం వలన చేతులు చెమట పట్టడం జరుగుతుంది. రైడ్ సమయంలో ఒకవేళ వర్షం కురుస్తున్నట్లయితే.. తడిచిన చేతులు జారే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితి ఎదురవ్వకుండా, దృఢమైన పట్టు కలిగి ఉండేందుకు చేతికి హ్యాండ్ గ్లౌవ్స్‌ని ధరించాల్సిన అవసరం ఉంది. గ్లౌవ్స్‌ని ధరించడం వలన రేస్ పెంచడం, తగ్గించడంపై పట్టు ఉంటుంది. తద్వారా రైడర్ సురక్షితంగా ఉంటారు. బూట్లు.. స్థిరత్వం కోసం దృఢమైన పాదరక్షలు ధరించాల్సిన అవసరం ఉంది. బైక్‌పై వెళ్తున్న క్రమంలో ఏవైనా మలుపులు వచ్చినప్పుడు పాదాలు కింద తగిలే అవకాశం ఉటుంది. అందుకే.. దృఢమైన, ఎత్తైన బూట్లు రైడర్‌కు రక్షణగా ఉంటాయి. అంతేకాదు.. మీ కాళ్లను గాయాల నుంచి రక్షిస్తుంది. రిఫ్లెక్టివ్ వెస్ట్‌లు, స్టిక్కర్లు.. నైట్ రైడింగ్ ప్రత్యేకమైన థ్రిల్‌ను అందిస్తుంది. అయితే ఇది విజిబిలిటీ పరంగా సవాళ్లతో కూడుకుని ఉంటుంది. అందుకే రాత్రివేళ బైక్‌పై ప్రయాణించే వారు తమ బైక్‌లకు రిఫ్లెక్టివ్ వెస్ట్‌లు, స్టిక్కర్‌లు ఉంచుకోవడం చాలా అవసరం. వీటి కారణంగా రాత్రి వేళ ఎదురుగా గానీ, వెనుక వైపు గానీ వస్తున్న వాహనాలకు మీ వాహనాన్ని గుర్తించడానికి వీలుగా ఉంటుంది. బీమా.. బైక్ నడపడమే కాదు.. బైక్‌కి బీమా కూడా చాలా అవసరం. ఏదైనా అనుకోని దుర్ఘటన జరిగితే.. ఇన్స్యూరెన్స్ అనేది రైడర్‌కు, వారి కుటుంబానికి ఎంతో సపోర్ట్‌గా ఉంటుంది. అందుకే.. తప్పనిసరిగా బైక్ ఇన్స్యూరెన్స్ తీసుకోవాలి. Also Read: శరీరంలో గాయం మచ్చ పోవట్లేదా? జస్ట్ ఇలా చేస్తే చాలు మరక మాయం..! ఈ రాశుల వారు వారం రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే కష్టాలు తప్పవు..! #bike-riding #bike-riding-security-tips మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి