Spelling Mistake : టీచర్ల ''బెడ్‌ పర్ఫామెన్స్‌''... జీతం కోత.. ఎక్కడంటే!

బీహార్‌ విద్యాశాఖలో జరిగిన ఓ పొరపాటు వల్ల ఏకంగా అర్థాలే మారిపోయాయి. దీంతో ఈ విషయం కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. అసలు విషయం ఏంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదివేయండి.

New Update
Spelling Mistake : టీచర్ల ''బెడ్‌ పర్ఫామెన్స్‌''... జీతం కోత.. ఎక్కడంటే!

Spelling Mistake Salary Cut : ఒక్క అక్షరం వల్ల అర్థాలు మారిపోయి... ఎన్నో తిప్పలు తెచ్చి పెట్టడం మనం అప్పుడప్పుడు చూస్తుంటాం. కొన్ని సార్లు ఈ అక్షర దోషాల (Spelling Mistake) వల్ల జీవితాలే తలకిందులైన పరిస్థితులు కూడా ఉన్నాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి బీహార్‌ (Bihar) రాష్ట్రంలో ఏకంగా విద్యాశాఖలో చోటు చేసుకుంది.

ఒక్క అక్షరం మారితే ఎన్ని అనర్ధాలు జరుగుతాయో ఇదే ఉదాహరణ. రాష్ట్రంలోని జాముయిలోని ఓ పాఠశాల ఉపాధ్యాయులకు (School Teachers) జీతాలు కట్ చేశారు. అయితే దీనికి కారణంగా చూపించిన విషయం తెలిసి అందరూ నోరెళ్లబెట్టారు . ‘‘బెడ్ పర్ఫామెన్స్’’ కారణంగా వీరు జీతం కోతను ఎదుర్కొన్నారు. అయితే, ‘‘బ్యాడ్ పర్ఫామెన్స్ ’’ అని రాయడానికి బదులుగా ఒక్క అక్షరంతో మొత్తం అర్థమే మారిపోయింది. ఒకే పత్రంలో ఇలా 14 సార్లు తప్పులు కనిపించాయి.

ప్రస్తుతం ఈ విషయం ఆన్‌లైన్‌లో ట్రోల్ అవుతోంది. గత వారం విద్యాశాఖ అధికారులు జాముయులోని పలు పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అదే రోజు పలువురు ఉపాధ్యాయులు విధులకు గైర్హాజరయ్యారు. ఇంకా చాలా మంది పనితీరు సరిగా లేదని అధికారులు గుర్తించారు. తనిఖీల అనంతరం జాముయిలోని విద్యాశాఖ అధికారి 16 మంది ఉపాధ్యాయులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు లేఖను విడుదల చేశారు. ఫలితంగా ఒక రోజు జీతం కట్ చేశారు.

దీనికి సంబంధించిన సర్య్కులర్ జారీ చేసే సమయంలో మే 22 నాటి అధికారిక ఆర్డర్‌లో ‘‘బ్యాడ్‌’కి బదులుగా ‘బెడ్‌’’ అని తప్పుగా రాశారు. దీంతో బ్యాడ్ పర్ఫామెన్స్ కాస్త ‘‘బెడ్ పర్ఫామెన్స్ (Bed Performance) ’’గా మారింది. దీంతో పూర్తి అర్థమే మారిపోయి పరువు పోయింది. వెంటనే విద్యాశాఖ తప్పును సరిదిద్దుకునేందుకు త్వరితగతిన కరెక్షన్ లెటర్ జారీ చేసింది.

Also read: 8 రోజుల క్రితం పెళ్లి..8 మందిని చంపి ..తాను కూడా చచ్చాడు!

Advertisment
తాజా కథనాలు