Bihar Politics: మారనున్న లెక్కలు.. ఇద్దరు డిప్యూటీ సీఎంలు.. నితీశ్ రాజీనామాకు రంగం సిద్ధం! బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇవాళ(జనవరి 28) తన రాజీనామాను సమర్పించే అవకాశం ఉంది. లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ RJD- కాంగ్రెస్‌తో తన 18 నెలల పాలక పొత్తుకు ముగింపు పలకనున్నారు. బీజేపీతో కలిసి ఆయన తిరిగి ఎన్‌డీఏలోకి తిరిగి వెళ్లనున్నారు. By Trinath 28 Jan 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Bihar political developments updates: బీహార్‌లో అధికార మార్పిడి ఖరారైంది. ఆదివారం ఉదయం 10 గంటలకు జరిగే జేడీయూ ఎమ్మెల్యే పార్టీ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. సమావేశం తర్వాత బీజేపీ-జేడీయూ శాసనసభా పక్షాల ఉమ్మడి సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను ఎన్‌డీఏ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకోనున్నారు. నాయకుడిని ఎన్నుకున్న తర్వాత, నితీష్ కుమార్ రాజ్‌భవన్‌కు వెళ్లి రాజీనామా చేస్తారు. తొమ్మిదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం: రాజ్‌భవన్ ఆమోదం తెలిపితే ఆదివారం నాడు కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. నితీష్ కుమార్ తొమ్మిదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. మరుసటి రోజు సోమవారం, కొత్త ప్రభుత్వ కేబినెట్ సమావేశం ఉంటుంది. ఈ భేటీలో శాసనసభ సమావేశాన్ని నిర్వహించడంతో పాటువిశ్వాస తీర్మానం పొందడంపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇక నిన్న(జనవరి 27) ముఖ్యమంత్రి నివాసం 01 అన్నే మార్గ్‌లో జేడీయూ కోర్ టీమ్ సమావేశం జరిగింది. ఇందులో ఎమ్మెల్యేలంతా పాట్నాలోనే ఉండాలని కోరారు. సాయంత్రానికే చాలా మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్నారు. ఇద్దరు డిప్యూటీ సీఎంలు: ఆదివారం ఉదయం 10 గంటలకు జరగనున్న జేడీయూ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో ఆర్జేడీ ప్రభుత్వంతో తెగతెంపులు చేసుకుని కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది జేడీయూ-బీజేపీ సర్కార్. కొత్త ప్రభుత్వంలో బీజేపీకి ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉంటారు. సుశీల్ మోదీ లేదా తార్కిషోర్ ప్రసాద్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. రేణుదేవి రెండో ఉప ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. అయితే తాజా పరిణామాలపై ఇప్పటివరకు బీజేపీ, జేడీయూ నుంచి ఏ నాయకుడూ అధికారికంగా మాట్లాడలేదు. బీహార్‌లో ఓవైపు రాజకీయ గందరగోళం నెలకొని ఉండగా.. LJP రామ్ విలాస్ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ న్యూఢిల్లీలో హోం మంత్రి అమిత్ షాను కలిశారు. అటు కాంగ్రెస్ శాసనసభా పక్షం చీలిపోతుందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. నితీష్ కుమార్‌తో మాట్లాడేందుకు మల్లికార్జున్ ఖర్గే ప్రయత్నించారని, అయితే ఆయన అందుబాటులోకి రాలేదని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ తెలిపారు. లాలూ ఏం చేస్తారు? బీహార్‌లో తలెత్తిన రాజకీయ గందరగోళం మధ్య, తుది నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్రీయ జనతాదళ్(RJD) పార్టీ జాతీయ అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌కు అధికారం ఇచ్చింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తదుపరి అడుగుపై ఆర్జేడీ ఓ కన్నేసి ఉంచింది. శనివారం ఉపముఖ్యమంత్రి తేజస్వీ ప్రసాద్ యాదవ్ నివాసంలో ఆర్జేడీ శాసనసభా పక్ష సమావేశం జరిగింది. ఇందులో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, శాసనమండలి సభ్యులంతా ఒకే మాటపై నిలబడ్డారు. లాలూ ప్రసాద్ యాదవ్ నిర్ణయానికి అనుగుణంగా నడుచుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. జాతీయ అధ్యక్షుడు లాలూ ప్రసాద్, ఉప ముఖ్యమంత్రి తేజస్వీ ప్రసాద్ యాదవ్, రాష్ట్ర అధ్యక్షుడు జగదానంద్ సింగ్ సహా పార్టీ సీనియర్ నేతల సమక్షంలో పలు విధాన నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌పై పార్టీ అధికారి, ఎమ్మెల్యే, నాయకులు ఎవరూ తీవ్ర వ్యాఖ్యలు చేయకూడదని నిర్ణయించారు. Also Read: ప్రతిరోజూ ఉదయం 11 గంటలకు ఈ ఒక్క పని చేయండి చాలు..రోగాలు అన్ని పారిపోతాయి! WATCH: #bihar #nitish-kumar #bihar-politics #lalu-prasad-yadav మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి