/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-03T121729.604.jpg)
Rajinikanth's Vettaiyan Release : గత ఏడాది 'జైలర్' మూవీతో బిగ్గెస్ట్ కం బ్యాక్ అందుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth).. ఈ ఏడాది 'వెట్టయాన్' (తెలుగులో వేటగాడు) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 'జై భీమ్' మూవీ ఫేమ్ జ్ఞానవేల్ రాజా డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ (Fahad Fasil), దగ్గుబాటి రానా, మంజు వారియర్, రితికా సింగ్ (Ritika Singh), దుషారా విజయన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రీసెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ అప్డేట్ బయటికి వచ్చింది.
'దేవర'కి పోటీగా...
'వెట్టయాన్' మూవీని అక్టోబర్ నెలలో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ రీసెంట్ గానే పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు. కానీ అప్పుడు రిలీజ్ డేట్ వెల్లడించలేదు. ఇక తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ని ఖరారు చేసినట్లు తెలిసింది. దాని ప్రకారం ఈదసరా కానుకగా అక్టోబర్ 10 న ఈ సినిమాని రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఇక సరిగ్గా ఇదే రోజున టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ 'దేవర' మూవీ రిలీజ్ కానుంది.
Also Read : మెక్సికోలో ‘NTR 31’ షూటింగ్.. మొత్తం 15 దేశాల్లో ప్లాన్ చేసిన ప్రశాంత్ నీల్!
దీంతో ఈసారి దసరా బరిలో రజినీకాంత్, ఎన్టీఆర్ ల మధ్య బిగ్గెస్ట్ బాక్సాఫీస్ ఫైట్ జరగబోతుంది. కాగా 'వెట్టయాన్' తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుండగా.. 'దేవర' తెలుగు, తమిళ్, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ కాబోతుంది. సో టాలీవుడ్, కోలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఈ రెండు సినిమాల మధ్య గట్టి పోటీ ఉండబోతుంది. మరి ఈ పోటీలో ఎవరు పై చేయి సాధిస్తారో వేచి చూడాలి..
Confirmed - #Vettaiyan - 10th Oct Release pic.twitter.com/PUY6AIMP4Q
— Aakashavaani (@TheAakashavaani) June 3, 2024
 Follow Us
 Follow Us