N- Convention : N- కన్వెన్షన్ ఎఫెక్ట్, నాగార్జున పై తిరగబడ్డ 'బిగ్ బాస్' మాజీ కంటెస్టెంట్..హోస్ట్ గా తొలగించాలంటూ

అక్కినేని నాగార్జున N- కన్వెన్షన్ ను చెరువును ఆక్రమించి నిర్మించారన్న ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నాగార్జునను బిగ్‌బాస్ హోస్ట్‌గా తప్పించాలని బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ బాబు గోగినేని డిమాండ్ చేశారు. ఈ మేరకు తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.

N- Convention : N- కన్వెన్షన్ ఎఫెక్ట్, నాగార్జున పై తిరగబడ్డ 'బిగ్ బాస్' మాజీ కంటెస్టెంట్..హోస్ట్ గా తొలగించాలంటూ
New Update

Babu Gogineni : మాదాపూర్‌లోని నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేతను హైడ్రా అధికారులు కూల్చేసిన సంగతి తెలిసిందే. తమ్మిడి హడ్డి చెరువు FTL, బఫర్ జోన్ పరిధిలో నాగార్జున N-కన్వెన్షన్ ఉంది. నాగార్జున తుమ్మిడి హడ్డి చెరువును కబ్జా చేసి బఫర్ జోన్లో కన్వెన్షన్‌‌ను నిర్మించారని ఫిర్యాదు రావడంతో అధికారులు N-కన్వెన్షన్ ను కూల్చేశారు. నాగార్జున దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఆయన వేసిన పిటిషన్ కు అనుకూలంగా కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. కూల్చివేతపై స్టే విధించింది. కూల్చివేతలు ఆపాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉంటే N- కన్వెన్షన్ ను చెరువును ఆక్రమించి నిర్మించారన్న ఆరోపణల నేపథ్యంలో నాగార్జునను బిగ్‌బాస్ హోస్ట్‌గా తప్పించాలని ప్రముఖ హేతువాది బాబు గోగినేని డిమాండ్ చేశారు.

Also Read : ఓటీటీలోకి అల్లు శిరీష్ ‘బడ్డీ’.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

‘అక్రమ కట్టడాలపై ఆరోపణలు ఎదుర్కొంటున్న తమ షో హోస్ట్‌ను బిగ్‌బాస్ నిర్వాహకులు తక్షణమే మార్చాలి. లేదంటే హౌస్ మేట్స్, టీవీ వీక్షకులు ఓట్లు వేసి మరీ ఆయన్ను ఎలిమినేట్ చేయాలి’ అని తన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. దీంతో ఆయన పెట్టిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. కాగా బాబు గోగినేని బిగ్ బాస్ రెండో సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్నాడు.

publive-image

#akkineni-nagarjuna #babu-gogineni
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe