/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-20T155417.714.jpg)
Big Twist In Bangalore Rave party : బెంగళూరులో నిర్వహించిన రేవ్ పార్టీలో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని జీఆర్ ఫామ్ హౌస్(GR Farmhouse) లో రేవ్ పార్టీ జరిపారు. బర్త్ డే వేడుకల పేరుతో హైదరాబాద్ యువకులు ఈ పార్టీ ఏర్పాటు చేశారు. పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తోంది.
పలువురు సెలబ్రిటీలు, బడా బాబులు, మోడల్స్, టెకీలు ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా రేవ్ పార్టీలో ఓ తెలుగు హీరో ఉన్నారని వార్త వైరల్ అవుతోంది. అయితే, ఆ హీరో పేరు మాత్రం బయటికి రావడం లేదు. పార్టీ ఏర్పాటు చేసిన హైదరాబాద్‌కు చెందిన వాసు ఈ రేవ్ పార్టీ ఏర్పాటు చేశాడు. కాన్‌కార్డ్ ఓనర్ గోపాల్‌రెడ్డికి చెందిన ఫామ్ హౌస్‌గా గుర్తించారు.
Also Read : రేవ్ పార్టీలో సంచలన విషయాలు.. టాలీవుడ్ హీరో, ఏపీ మంత్రి సన్నిహితులు?
దొరికిపోయిన హేమ
ఆ పార్టీలో నటి హేమ (Actress Hema)ఉన్నట్టు కన్నడ మీడియా ప్రచారం చేయగా..ఆమె ఆ ప్రచారాన్ని ఖండించారు. తాను హైదరాబాద్ లోనే ఉన్నట్టు వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే ఈ రేవ్ పార్టీకి సంబంధించి తాజాగా మరో బిగ్ ట్విస్ట్ బయటికొచ్చింది. తాజాగా హేమా రిలీజ్ చేసిన వీడియోని బెంగుళూరు ఫామ్ హౌస్ లోనే షూట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
బెంగుళూర్ లోనే ఉండి కూడా తాను హైదరాబాద్ లో ఉన్నానని వీడియోలో కవర్ చేసే ప్రయత్నం చేసిందని, రేవ్ పార్టీ జరిగిన ఫామ్ హౌస్ లో ఉన్న గార్డెన్ ఏరియాలో హేమ ఆ వీడియోని షూట్ చేయడంతో పోలీసులు కనిపెట్టేశారు. దీంతో రేవ్ పార్టీలో హేమా ఉన్నట్లు పోలీసులు కన్ఫర్మ్ చేసినట్లు మీడియాలో పలు కథనాలు వస్తున్నాయి.
బెంగళూరులో రేవ్ పార్టీ కలకలం
ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని జీఆర్ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ.ఆ పార్టీలో నటి హేమ ఉన్నట్టు కన్నడ మీడియా ప్రచారం.ఆ ప్రచారాన్ని ఖండించిన హేమ
తాను హైదరాబాద్ లోనే ఉన్నట్టు చెప్పిన హేమ.#raveparty #banglore #Actresshema #RTV pic.twitter.com/LZGiq7IDH9— RTV (@RTVnewsnetwork) May 20, 2024