Bigg Boss7 Promo : అంతా శుభ శ్రీకి ఫెవర్.. యావర్ టార్గెట్ అయ్యాడా..?

బిగ్ బాస్ ప్రోమోలో చూసినట్లే ఇంట్లో కెప్టెన్సీ యుద్ధం మొదలైంది. సంచాలకుల నిర్ణయాన్ని ఒప్పుకోని ఇంటి సభ్యులు యావర్, శోభ పై ఫైర్ అవుతారు.

New Update
Bigg Boss7 Promo : అంతా శుభ శ్రీకి ఫెవర్.. యావర్ టార్గెట్ అయ్యాడా..?

Bigg Boss 7 Promo :  బిగ్ బాస్ 7 రోజు రోజు కొత్త కొత్త మలుపులతో, ట్విస్టులతో ఆసక్తికరంగా సాగుతుంది. నిన్నటి ఎపిసోడ్ లో కెప్టెన్సీ టాస్క్(Captaincy Task) సంబంధించి ఇంట్లో మామూలు రచ్చ జరగలేదు. అసలు టాస్క్ లో విజేత ఎవరో కూడా తేల్చలేనంత రేంజ్ లో టాస్క్ ఆడారు.

సంచాలకులుగా శోభా (Shobha), యావర్ (Yawar) చాలా సేపు ఆర్గుమెంట్స్ , వాదనలు జరిగాక వాళ్ళ నిర్ణయాన్ని బిగ్ బాస్ కి (Bigg Boss) చెప్పారు. మొదటి స్థానంలో గౌతమ్ , శుభ రెండవ స్థానంలో శోభా, ప్రియాంక ఇక మూడు, నాలుగు స్థానాల్లో అమర్ , సందీప్ శివాజీ, ప్రశాంత్.

సంచాలకుల నిర్ణయాన్ని అంగీకరించని ఇంటి సభ్యులు వారితో వాదిస్తారు. ఇక అమర్ ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు అంటూ వారి పై ఫైర్ అవుతాడు. ఈరోజు ప్రోమో చూస్తే టాస్క్ సంబందించిన రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. మీ డెసిషన్ కు మేము ఒప్పుకోము అంటూ యావర్ పై ఫైర్ అవుతున్నారు.

అంతా శుభ శ్రీకి ఫెవర్

ఇక అమర్ యావర్ పై కోపంతో ఊగిపోతున్నాడు. అంత తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. మమల్ని గ్రూపులు గా ఆడుతున్నారు, కొందరికి మాత్రం ఫెవర్ గా ఉంటున్నారు అన్నారు. ఇప్పుడు మీరు చేసింది ఫెవరిజం అంతా శుభ శ్రీకి(Subha Shree) ఫెవర్ గా చేసావు కదా అంటూ ఫైర్ అయ్యాడు.

శివాజీ VS యావర్

శుభ నువ్వు బెల్ కొట్టవా అని యావర్ అడగడం విన్న శివాజీ (Sivaji).. సంచాలకుడిగా చూడకుండానే నువ్వు డెసిషన్ ఎలా తీసుకుంటావు, సంచాలకుడి అన్నీ చూడటం నీ బాధ్యత అంటూ గట్టిగానే వాదించాడు

అందరికి టార్గెట్ అయిన యావర్

ప్రోమో ప్రకారం యావర్ అందరికి టార్గెట్ అయ్యాడేమో అనిపిస్తుంది. సంచాలకుడిగా యావర్ తన నిర్ణయాన్ని క్లారిటీగా చెప్పినా. శోభా, యావర్ తో ఇంటి సభ్యులు వాదిస్తూనే ఉన్నారు. ఇక ప్రియాంక అయితే నేను ఈ నిర్ణయాన్ని అంగీకరించను అంటోంది. ఇక పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth), అమర్ ఈ టాస్క్ తో యావర్ ఇన్ని రోజులు తెచ్చుకున్న పేరంతా పోతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరీ రాత్రికి ఎపిసోడ్ లో వీళ్ళ రచ్చ ఎలా ఉండబోతుందో.. లేదంటే బిగ్ బాస్ వీళ్ళ గొడవలు చూసి టాస్క్(Task)  రద్దు అని పెద్ద ట్విస్ట్ ఇస్తారేమో.

Also Read: Bigg Boss 7: కెప్టెన్సీ టాస్క్ యుద్ధం.. సంచాలకులకు చుక్కలు కనిపించాయి..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు