/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-02T180033.371.jpg)
Bigg Boss Telugu Season 8 : బుల్లితెర పై అత్యధిక ప్రేక్షకాదరణ పొందిన రియాలిటీ షోస్ లో బిగ్ బాస్ ఒకటి. ఈ షో మొదలైన కొంత సమయంలోనే సూపర్ సక్సెస్ అయ్యింది. విభిన్నమైన కాన్సెప్ట్స్, కంటెస్టెంట్స్ తో అలరిస్తూ బుల్లితెర పై టాప్ రేటింగ్ షోగా కొనసాగుతుంది. ఇప్పటికే 7 సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ షో త్వరలో సీజన్ 8 తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే సీజన్ 8 ప్రోమో విడుదల చేశారు మేకర్స్.. తాజాగా లేటెస్ట్ సీజన్ కు సంబంధించిన టీజర్ వదిలారు.
ఈ టీజర్ విడుదలై అభిమానులను ఉత్కంఠ భరితంగా మార్చింది. ప్రముఖ హోస్ట్ నాగార్జున అద్భుతమైన ప్రేజెంటేషన్‌తో టీజర్‌ను మరింత ఆసక్తికరంగా మార్చారు. కమెడియన్ సత్య పాత్రతో పరిచయమైన టీజర్‌లో నాగార్జున జీనీలా కనిపించారు. ‘వరాలు ఇచ్చే కింగ్.. ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదు’ అంటూ నాగార్జున డైలాగ్ అలరిస్తోంది. ‘ఇన్ఫినిటీ ఆఫ్ ఫన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం సిద్ధంకండి’ అంటూ ఈ సీజన్ సరికొత్తగా అలరించనుంది.
Ladies and Gentlemen, presenting the teaser of SEASON 8! This time, we are going above and beyond LIMITLESS ENTERTAINMENT coming your way, brace yourselves! #BiggBossTelugu8 pic.twitter.com/05gwj8sdw1
— Starmaa (@StarMaa) August 2, 2024
తాజాగా రిలీజైన టీజర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా గత కొన్ని సీజన్ల నుంచి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న నాగార్జున.. ఈసారి కూడా హోస్ట్‌గా కనిపించనున్నారు. మరోవైపు సీజన్ 8 లో పాల్గొనబోయే పలు కంటెస్టెంట్స్ పేర్లు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కన్నడ సీరియల్ నటి ప్రేరణ, బుల్లితెర మెగాస్టార్ గా పిలువబడే సీరియల్ యాక్టర్ ప్రభాకర్, సీరియల్ నటులు ఏకనాథ్ - హారిక, కుమారి ఆంటీ, అంజలి పవన్, కిరాక్ ఆర్పీ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.