Bigg Boss Telugu 8 Promo: బిగ్ బాస్ సీజన్ 8 ఆసక్తికరంగా కొనసాగుతోంది. నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఇంటి మొదటి చీఫ్స్ గా ఎన్నికైన నిఖిల్, నైనిక, యష్మీ ముగ్గురు తమ క్లాన్ సభ్యులను నిర్ణయించుకుంటారు. నైనిక, యష్మీ క్లాన్ లో ఒకే సంఖ్యలో సభ్యులు ఉండడంతో.. ఈ ఇరు టీమ్స్ లో ఎవరు బెటర్ అని నిరూపించుకోవడానికి బిగ్ బాస్ పలు ఛాలెంజెస్ ఇస్తాడు. అందులో భాగంగా నిన్నటి ఎపిసోడ్ లో ఇరు టీమ్స్ కు మొదటి ఛాలెంజ్ ఇవ్వగా.. నైనిక క్లాన్ సభ్యులు విన్ అవుతారు.
రెండవ ఛాలెంజ్
ఇక తాజాగా విడుదలైన ఈరోజు ఎపిసోడ్ ప్రోమోలో నైనిక, యష్మీ టీమ్స్ రెండవ ఛాలెంజ్ లో భాగంగా 'లూప్ ది హోప్'(రింగ్ టాస్క్) అనే టాస్క్ లో పాల్గొన్నారు. ఈ టాస్క్ లో ఇరు టీమ్ సభ్యులు లైన్ గా నిలబడి చేతులు టచ్ చేయకుండా కేవలం శరీరంతోనే ఇటు వైపు ఉన్న రింగ్స్ ను అటు వైపుకు చేర్చాలి. అలా చివరి వరకు ఏ టీమ్ సభ్యులు ఎక్కువ రింగ్స్ చేరుస్తారో వాళ్ళు విజేతలుగా నిలుస్తారని ప్రకటించాడు బిగ్ బాస్. ఈ టాస్క్ కు నిఖిల్ సంచలకుడిగా వ్యవహరించాడు.
యష్మీ VS నిఖిల్
ఈ టాస్క్ లో తెలివిగా స్ట్రాటజీ యూజ్ చేసిన నైనిక టీమ్ విజేతలుగా నిలుస్తారు. ఇక ఓడిపోయిన యష్మీ టీమ్.. నైనిక వాళ్ళు స్ట్రాటజీ తప్పని వాదించడం మొదలు పెడతారు. బిగ్ బాస్ కేవలం బాడీ మాత్రమే యూజ్ చేయాలని చెప్పాడు.. కానీ నైనిక టీమ్ సభ్యులు హెడ్ యూజ్ చేసి రింగ్ తీసుకొచ్చారు. అడ్డదిడ్డమైన రూమ్ మేం ఫాలో అవ్వము అని సంచాలకుడు నిఖిల్ తో యష్మీ వాదిస్తుంది. దీంతో నిఖిల్ బిగ్ బాస్ చెప్పిన ప్రకారం తల కూడా శరీరంలో భాగమే కదా.. అందుకే వాళ్ళు ఆ స్ట్రాటజీ వాడారని చెప్పే ప్రయత్నం చేశాడు. ఇక ఈ విషయంలో యష్మీ- నిఖిల్ మధ్య పెద్ద గొడవ జరిగినట్లుగా ప్రోమోలో కనిపించింది.
Also Read: SD18: సాయి ధరమ్ తేజ్ 'SD18' అప్డేట్.. హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ ఫస్ట్ లుక్ - Rtvlive.com