Bigg Boss Telugu 8 Promo: "బొక్కలో క్లారిటీ నీకుందా"... కిర్రాక్ సీత vs సోనియా..!

బిగ్ బాస్ సీజన్ 8 ఆసక్తికరంగా కొనసాగుతుంది. తాజాగా లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో ఇంటి సభ్యులంతా నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. నామినేషన్స్ లో సోనియా, సీత, ప్రేరణ మధ్య పెద్ద గొడవ మొదలైంది. ఈ ప్రోమోను మీరు కూడా చూసేయండి.

Bigg Boss Telugu 8 Promo: "బొక్కలో క్లారిటీ నీకుందా"... కిర్రాక్ సీత vs సోనియా..!
New Update

Bigg Boss Telugu 8: నిన్నటి వీకెండ్ ఎపిసోడ్ లో చాలా రోజులు సర్వైవ్ అవుతుంది అనుకున్న బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయిపోయి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక ఆదివారం తర్వాత ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసే నామినేషన్ డే వచ్చేసింది. తాజాగా బిగ్ బాస్ ఈరోజు నామినేషన్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశాడు.  ప్రోమోలో బిగ్ బాస్ ప్రతీ కంటెస్టెంట్ ఇద్దరు సభ్యులను నామినేట్ చేయాలని.. ఎవర్నైతే నామినేట్ చేయాలని అనుకుంటున్నారు తల పై పెయింట్ పోసి నామినేట్ చేయాలని చెప్పాడు. దీంతో కంటెస్టెంట్స్ ఒకరి తర్వాత ఒకరు వచ్చి నామినేట్ చేయడం మొదలు పెట్టారు. ఈ ప్రక్రియలో ప్రేరణ, సీత, సోనియా మధ్య పెద్ద గొడవ జరిగింది.

సీత vs ప్రేరణ

కిర్రాక్ సీత.. ''మీకు బయట ఫ్రెండ్ షిప్ ఉంటే మీరు ఫాలో అవ్వండి.. కానీ వేరే వాళ్ళని ఫాలో అవ్వమనే రైట్ మీకు లేదనే'' పాయింట్ తో ప్రేరణను నామినేట్ చేసింది. యష్మీ, నిఖిల్, ప్రేరణను ఉద్దేశించి సీత ఈ పాయింట్ రైస్ చేయడంతో ప్రేరణ రెచ్చిపోయింది. ''ఫస్ట్ బయట నుంచి బయట నుంచి అని అనడం ఆపేయ్'' అంటూ సీత పై ఫైర్ అయ్యింది. ఇక ఇద్దరి మధ్య పెద్ద వాగ్వాదమె జరిగినట్లు ప్రోమోలో చూపించారు.

ఆ తర్వాత సోనియా వచ్చి సీతని నామినేట్ చేసింది. గేమ్ క్లారిటీ లేదంటూ సీతకు నామినేషన్ వేసింది. దానికి సీత సోనియాకు అదే స్టైల్ లో కౌంటర్ ఇచ్చింది. ''ముందు నువ్వు గేమ్ అర్థం చేసుకో.. అప్పుడు నాకు చెప్పు.. నీకు క్లారిటీ లేదు కానీ, నాకు చెప్తున్నావు.. నీకుందా బొక్కలో క్లారిటీ '' అంటూ సోనియా పై నోటు జారింది సీత. ఇక సీత బొక్కలో క్లారిటీ అనడంతో సోనియా ఫుల్ ఫైర్ అయ్యింది. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు అని సీతతో వాదనకు దిగింది. ఇక గొడవ ఎంత వరకు వెళ్లిందో తెలియాలంటే నైట్ ఎపిసోడ్ చూడాల్సిందే.

Also Read: Kaloji Narayana Rao: కాళోజీ కలం ధిక్కార స్వరం.. ఆయన బతుకంతా తెలంగాణ కోసమే! - Rtvlive.com

#bigg-boss-telugu-8-promo
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe