Bigg Boss 7 Telugu: ‘‘నేను తొక్కేస్తున్నాడని  చెప్పలేదు’’.. మాట మార్చకండి..!

బిగ్ బాస్ సీజన్ 7 నిన్నటి నామినేషన్ ప్రక్రియలో రాజమాతలుగా వ్యవహరించిన శోభ, రతిక, ప్రియాంక, అశ్విని ఇంటి సభ్యుల వాదనలు విన్న తర్వాత.. సరైన వాదనలను ఏకీభవించి యావర్, భోలే, శివాజీ, రతికలను నామినేట్ చేశారు.

New Update
Bigg Boss 7 Telugu: ‘‘నేను తొక్కేస్తున్నాడని  చెప్పలేదు’’.. మాట మార్చకండి..!

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ నామినేషన్ ప్రక్రియను కొంచం వెరైటీగా ప్లాన్ చేశారు. ఈ వారం నామినేషన్స్ బిగ్ బాస్ మహారాజ్యంలో జరుగుతుంది.. ఈ ప్రక్రియలో రాజమాతలైన శోభ, ప్రియాంక, అశ్విని, రతిక చెప్పిందే తుది నిర్ణయమని తెలిపారు బిగ్ బాస్. ఈ నామినేషన్ ప్రక్రియలో మిగిలిన ఇంటి సభ్యులు.. వారు నామినేట్ చేసే సభ్యుడి పేరు చెప్పి .. వారి వాదనలను రాజమాతలకు వినిపించారు.

publive-image

గౌతమ్ VS శివాజీ 

ఈ ప్రక్రియలో గౌతమ్ (Goutham), శివాజీ (Shivaji) ఇద్దరి మధ్య వాదనలు జరిగాయి. గౌతమ్ శివాజీని నామినేట్ చేస్తూ.. లాస్ట్ వీక్ టాస్క్ లో నా క్యారెక్టర్ గురించి మాట్లాడారు.. డాక్టర్ అయ్యుండి ఇలా మాట్లాడం తప్పు అన్నారు..అది నాకు నచ్చలేదని చెప్పాడు. దానికి శివాజీ మరి నువ్వు కెమెరా ముందుకు వెళ్లి ' నన్ను తొక్కేస్తున్నాడు.. శివాజీ అని నా పై ఆరోపణలు చేశావు కదా.. అంటూ వాదించాడు. ఆ తర్వాత గౌతమ్ స్పందిస్తూ.. ‘‘నేను తొక్కేస్తున్నాడని  చెప్పలేదు’’ అని అన్నాడు. గౌతమ్ వాదనలతో సరైనవని భావించిన రాజమాతలు శివాజీని నామినేట్ చేశారు. ఆ తర్వాత అమర్ (Amar) భోలేను (Bhole) నామినేట్ చేశాడు.

Bigg Boss 7 Telugu

నేను సెల్ఫ్ నామినేట్ అవుతా..

ఆ తర్వాత యావర్, శివాజీ ఇద్దరు అమర్ ను నామినేట్ చేయడానికి వచ్చారు. కానీ ఇద్దరు కలిసి ఒకరినే నామినేట్ చేయకూడదు.. మీ ఇద్దరిలో ఎవరైనా ఒకరు మీ నామినేషన్ పేరు మార్చుకోవాలి.. లేదా మీరే సెల్ఫ్ నామినేట్ అవుతారని బిగ్ బాస్ తెలిపారు. ముందుగా శివాజీ అమర్ పేరు చెప్పినందున.. యావర్.. మీ నామినేషన్ మార్చుకోవాలని చెప్పారు. బిగ్ బాస్ చెప్పిన తర్వాత కూడా యావర్ అమర్ పేరే చెప్పడంతో సెల్ఫ్ నామినేట్ అయ్యాడు.

Bigg Boss 7 Telugu

చివరిలో రాజమాతలైన రతిక, శోభ, ప్రియాంక, అశ్విని, నలుగురిలో నుంచి కెప్టెన్ శోభను మినహాయించి.. మిగతా ముగ్గురు ఏకాభిప్రాయంతో ఒకరిని నామినేట్ చేయాలనీ బిగ్ బాస్ తెలిపారు. ముగ్గురిలో ప్రియాంక, రతిక ఇద్దరికి సమానంగా ఓట్స్ రావడంతో.. కెప్టెన్  శోభా నిర్ణయం తీసుకోవాలని బిగ్ బాస్ చెప్పాడు. దీంతో శోభ.. రతిక పేరు చెప్పింది. ఇంతటితో నామినేషన్ ప్రక్రియ ముగిసింది. ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్ళడానికి నామినేట్ అయిన సభ్యులు రతిక, యావర్, శివాజీ, భోలే.

Bigg Boss 7 Telugu

Also Read: Bigg Boss 7 Telugu Promo: నువ్వు అరిస్తే.. నేను అరుస్తా.. అయితే అరువు..!

Advertisment
తాజా కథనాలు