Bigg Boss 7 Telugu: "గోడ మీద పిల్లిలా మాట్లాడకు".. రతిక పై ఫైర్ అయిన అర్జున్..!

బిగ్ బాస్ సీజన్ 7.. తాజాగా విడుదలైన ప్రోమోలో బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఒక టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో హౌస్ మేట్స్ అంత కలిసి చర్చించి 1 నుంచి 10 స్థానాల్లో ఎవరి.. ర్యాంకింగ్ ఎక్కడో నిర్ణయించాలని తెలిపారు.

New Update
Bigg Boss 7 Telugu: "గోడ మీద పిల్లిలా మాట్లాడకు".. రతిక పై ఫైర్ అయిన అర్జున్..!

Bigg Boss 7 Telugu:  బిగ్ బాస్ సీజన్ 7..  ఇక ఈరోజు తాజాగా విడుదలైన ప్రోమోలో బిగ్ బాస్ ఇంటి సభ్యులకు టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ తో హౌస్ మేట్స్ మళ్ళీ వాదనలు మొదలు పెట్టారు. ఈ ప్రోమోలో బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఇచ్చిన టాస్క్.. బిగ్ బాస్ ఇంట్లో పది వారల మైలు రాయిని దాటి.. విన్నర్ అవ్వడానికి మీ పది మంది మాత్రమే మిగిలారు. ప్రతి ఒక్కరి ఓవర్ అల్ పెర్ఫామెన్స్ దృష్టిలో ఉంచుకొని మీ పది మంది ఏ స్థానంలో ఉంటారో చర్చించుకొని.. పది నుంచి ఒకటి వరకు ర్యాంకింగ్ ఇవ్వాలని.. ఇంటి సభ్యుల మధ్య చిచ్చు పెట్టారు బిగ్ బాస్. ఇక ఈ టాస్క్ లో వారి ర్యాంకింగ్ కోసం ఇంటి సభ్యులు ఒకరితో ఒకరు వాదించుకోవడం మొదలు పెట్టారు. టాస్క్ స్టార్ అవ్వగానే.. మొదటి స్థానంలో శివాజీ (Shivaji), యావర్, గౌతమ్ (Gautham) నిల్చున్నారు. రెండో స్థానంలో ప్రియాంక, పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth) నిల్చోగా .. నాలుగవ స్థానంలో అమర్, అశ్విని నిల్చున్నట్లుగా ప్రోమోలో కనిపించింది. ఇక ఇంటి సభ్యులంతా టాప్ 5 స్థానాల్లో నిలబడడానికి వారు ఎందుకు అర్హులు అని వాదనలు మొదలు పెట్టారు.

publive-image

నీకు 10th ప్లేస్ డిజర్వ్

ముందుగా టాప్ 5 లో నిల్చున్న రతిక.. నేను ఆడిన ఆట ప్రకారం నేను టాప్ 5 లో ఉంటానని.. 5th ర్యాంకింగ్ లో నిల్చుంది. దానికి శివాజీ.. లాస్ట్ వీక్ పర్ఫామెన్స్ చూస్తే ఆటలో.. నువ్వు 50, 60% మాత్రమే ఇచ్చావని తెలిపాడు. ఇక అర్జున్.. ముందున్న ఫోర్ వీక్స్ ఆట ప్రకారం చూస్తే.. నువ్వు 10th ప్లేస్ డిజర్వింగ్ అని చెప్పాడు. దానికి రతిక వాదిస్తూ.. నేను 10th ప్లేస్ అయితే కాదు అని శివాజితో వాదించింది. ఇక శివాజీ .. ఇది హౌస్ మేట్స్ అంతా కలిసి తీసుకున్న నిర్ణయమని చెప్పగానే రతిక 10th ప్లేస్ వెళ్లి నిల్చుంది.

publive-image

గోడ మీద పిల్లిలా మాట్లాడకు

ర్యాంకింగ్ విషయంలో అర్జున్, రతిక ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఇద్దరు వాదించుకున్నారు. రతిక మాట్లాడుతూ.. నేను 6th ప్లేస్ అనుకున్నాను.. కానీ అది పోయింది అనగానే.. అర్జున్.. "గోడ మీద పిల్లిలా ఆన్సర్స్ చెప్పకు" అంటూ రతిక పై సీరియస్ అయ్యాడు అర్జున్.

publive-image

మొదటి స్థానం నాదే

ఆ తర్వాత అమర్ వచ్చి.. 1st ప్లేస్ లో నిల్చొని.. నాకు మొదటి స్థానంలో ఉండాలని ఉంది అని చెప్పాడు. దానికి గౌతమ్.. లాస్ట్ రెండు వారాల ఆట ప్రకారం చూస్తే.. నువ్వు 6th ప్లేస్ అని చెప్పగానే.. అమర్ వెళ్లి 6th ప్లేస్ లో నిల్చున్నాడు. కానీ ఎప్పటికైనా మొదటి స్థానం నాదే అంటూ డైలాగ్ వేశాడు.

publive-image

శోభకు 7th ప్లేస్

ప్రోమో చివరిలో అర్జున్, శోభ ఇద్దరి మధ్య వాదన జరిగింది. నువ్వు ఇండివిజ్వల్ గా ఒక్క గేమ్ కూడా ఆడలేదని.. శోభకు 7th ప్లేస్ ఇచ్చాడు. దాని గురించి అమర్ తో ఏడుస్తూ బాధపడింది శోభ. ఇక అమర్ వాళ్ళు ఎవరు నువ్వు 7th ప్లేస్ అని చెప్పడానికి అంటూ శోభకు ధైర్యం చెప్పాడు.

Bigg Boss 7 Telugu

Also Read: Bigg Boss 7 Telugu: “ఇంకోసారి ఎవ్వరి మీద ఇలాంటి మాటలు చెప్పకు”.. రతికకు అమర్ వార్నింగ్..!

Advertisment
Advertisment
తాజా కథనాలు