Bigg Boss Season 7: హౌస్ లో నామినేషన్స్ రచ్చ .. ప్రోమో అదిరింది.. అమర్ VS శివాజీ

ఇంట్లో నామినేషన్స్ రచ్చ మొదలైంది. పవర్ అస్త్రా కోల్పోయిన శివాజీ ఇప్పుడు మామూలు కంటెస్టెంట్ అయ్యాడు. ఇప్పుడు శివాజీని కూడా నామినేట్ చేయవచ్చు. నామినేషన్ ప్రక్రియలో అమర్, శివాజీ కి పెద్ద గొడవే జరుగుతుంది.

Bigg Boss Season 7: హౌస్ లో నామినేషన్స్ రచ్చ .. ప్రోమో అదిరింది.. అమర్ VS శివాజీ
New Update

Bigg Boss Season 7 Nominations:  నామినేషన్స్ రచ్చ మామూలుగా లేదు.. ఇక వీకెండ్ ఎపిసోడ్ లో బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా, పూల్టా అని బిగ్ బాస్ మరో సారి నిరూపించారు. నాగార్జున (Nagarjuna) లాస్ట్ వీక్ నామినేషన్స్ గురించి మాట్లాడుతూ సంచాలకులుగా వ్యవహరించిన సందీప్ (Sandeep), శివాజీ (Sivaji), శోభ లో ఎవరు మీ పట్ల పక్ష పాతంగా ఉన్నారో చెప్పండి అంటూ హౌస్ మేట్స్ ని అడుగుతారు అప్పుడు మెజారిటీ సభ్యులు శివాజీ పేరు చెప్తారు. శివాజీ ఇంట్లో ఉండటానికి అర్హులు కాదు అని చెప్పడంతో బిగ్ బాస్ శివాజీ పవర్ అస్త్రా ను వెనక్కి తీసుకుంటాడు అలాగే తన ఇమ్మ్యూనిటి కూడా పోతుంది..

ఇక ఈరోజు ఇంట్లో అసలైన నామినేషన్స్ గోల మొదలైంది.. నామినేషన్స్ ప్రోమో అయితే విడుదలైంది. చూస్తుంటే అందరు గట్టిగానే వాదించుకుంటున్నారు. ప్రోమో ప్రకారం శివాజీ, అమర్ (Amar) కి మధ్య పెద్ద ఆర్గుమెంటే జరిగింది. ఇంతక ముందు నామినేషన్స్ ల కాకుండా శివాజీ ఈ సారి గట్టిగానే వాదిస్తున్నాడు..

అమర్ VS శివాజీ

నామినేషన్స్ లో అమర్ శివాజీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. అమర్ నువ్వు నన్ను పక్షపాతంగా ఉంటున్నావ్ అని అనడం నాకు నచ్చట్లేదు అంటూ నామినేట్ చేస్తాడు.. దానికి అమర్ అవును మీరు ప్రశాంత్ (Pallavi Prashanth) కే ఫేవర్ గా ఉన్నట్లు అనిపిస్తారు అంటాడు. దాంతో శివాజీ వాడికి అన్యాయం జరిగింది అందుకే వాడి పక్కన నిల్చున్న అని గట్టిగానే సమాధానమిస్తాడు..

ప్రియాంక VS యావర్

ప్రియాంక (Priyanka), యావర్ (Yawar) నామినేషన్ ఈరోజు ఎపిసోడ్ లో రచ్చ సృష్టించేలా ఉంది.. ప్రియాంక చెప్పిన తిండి రీజన్ యావర్ కు నచ్చలేదు దాంతో యావర్ ఇది ఒక సిల్లీ రీజన్ అంటూ కోపంతో ఊగిపోతాడు.

మొత్తానికి హౌస్ లో నామినేషన్ ప్రక్రియ చాలా హీట్ గానే కొనసాగుతోంది.. ప్రియాంక, శివాజీ గౌతమ్, శివాజీ ఒకరిని ఒకరు నామినేట్ చేసుకుంటారు.
గౌతమ్ తో శివాజీ చాలా వ్యాలిడ్ పాయింట్స్ మాట్లాడినట్టు అనిపిస్తుంది .. ప్రోమో ప్రకారం మెజారిటీ నామినేషన్స్ శివాజీ కే పడినట్లుగా ఉన్నాయి.. ప్రోమో ఉన్నత హైప్ ఎపిసోడ్ లో ఉంటుందా, లేదా అనేది చూడాలి.

Also Read: బిగ్ బాస్ సెన్సేషన్ శివాజీకి అక్కడ 20 ఎకరాలు.. ఇంకా ఎంత ఆస్తి ఉందో తెలుసా?

#bigg-boss #bigg-boss-season-7 #bigg-boss-7-contestants-telugu #bigg-boss-nominations #bigg-boss-7-latest-episode #bigg-boss-7-telugu
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి