Priyanka Jain: పుట్టెడు దు:ఖంలో బిగ్‌బాస్‌ ఫైనలిస్ట్‌.. తల్లికి క్యాన్సర్‌

బిగ్ బాస్ 7 ఫేమ్ ప్రియాంక మదర్ క్యాన్సర్ బారిన పడ్డారు. తాజాగా ఈ విషయాన్నీ తెలియజేసిన ప్రియాంక కన్నీళ్లు పెట్టుకుంది. "అమ్మకు లాప్రో స్కోపీ జరిగింది. ఇప్పుడు క్షేమంగా తిరిగి ఇంటికి వచ్చారు." అంటూ ఎమోషనల్ వీడియోను షేర్ చేసింది ప్రియాంక.

New Update
Priyanka Jain: పుట్టెడు దు:ఖంలో బిగ్‌బాస్‌ ఫైనలిస్ట్‌.. తల్లికి క్యాన్సర్‌

Priyanka Jain: బుల్లి తెర నటి ప్రియాంక జైన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మౌన రాగం సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత జానకి కలగనలేదు సీరియల్ ద్వారా ఫుల్ పాపులరైన ప్రియాంక బిగ్ బాస్ సీజన్ 7 లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. తన ఆట తీరుతో లేడీ శివంగి అని పేరు తెచ్చుకుంది. సీజన్ 7 లో టాప్ ఫైవ్ గా నిలిచిన ఏకైన లేడీ కంటెస్టెంట్ గా ఫుల్ క్రేజ్ దక్కించుకుంది ప్రియాంక. అయితే ఈ నటి ఇప్పుడు చాలా దుఃఖంలో ఉంది.

అమ్మకు క్యాన్సర్

ఇటీవలే ఒక వీడియోను రిలీజ్ చేసిన ప్రియాంక.. తన తల్లి ప్రాణాంతకమైన క్యాన్సర్ తో బాధపడుతున్నారని కన్నీళ్లు పెట్టుకుంది. ప్రియాంక మదర్ ఫాల్గుణి జైన్ క్యాన్సర్ తో హాస్పిటల్ లో ఉన్నారని తెలియజేసింది. వీడియోలో తల్లి పరిస్థితి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయిన ప్రియాంక ఇలా చెప్పుకొచ్చింది.

Also Read: Prabhas Rajasaab: మారుతి రాజాసాబ్‌’ కి ఈ చిక్కులేంటో.. రిలీజ్ ఆలస్యమేనా..?

publive-image

ఇలా జరుగుతుందని ఊహించలేదు 

"అమ్మకు ఇలాంటి పరిస్థితి వస్తుంది అని ఊహించలేదు. పీరియడ్స్ తో సంబంధం లేకుండ బ్లీడింగ్ ఎక్కువగా అయ్యింది. అయితే అమ్మ వయసు పై బడుతుంది కదా.. అందుకే ఇలా జరుగుతుందేమోనని అనుకోని నిర్లక్ష్యం చేశారు. కానీ హాస్పిటల్ కి వెళ్లి టెస్టులు చేయించిన తర్వాత క్యాన్సర్ అని తేలింది. ఇది విని మేమంతా షాకయ్యాము.. ముందే  చూపించే ఉంటే పరిస్థితి ఇంత వరకు వచ్చేది కాదు. ఇప్పుడు అమ్మకు లాప్రోస్కోపీ సర్జరీ జరిగింది. క్షేమంగా తిరిగి ఇంటికి వస్తుంది. అమ్మ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.. ఈ వీడియో చూసిన మీరు కూడా మా అమ్మ కోసం ప్రార్థించండి అంటూ ఎమోషనల్ వీడియోను షేర్ చేసింది ప్రియాంక జైన్."

Also Read: Anchor Sreemukhi : పింక్‌ డ్రెస్‌లో మత్తెక్కిస్తున్న శ్రీముఖి.. ఫొటోలు చూస్తే ఫ్లాట్‌ అవ్వాల్సిందే

Advertisment
తాజా కథనాలు