Priyanka Jain : సారీ చెప్పకుండా పెళ్లి చేసుకున్నాము.. వైరలవుతున్న ప్రియాంక జైన్ పోస్ట్..!

బిగ్ బాస్ తో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది బుల్లితెర నటి ప్రియాంక జైన్. అయితే తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఓ పోస్ట్ నెట్టింట్లో వైరల్ గా మారింది. సడన్ గా తన ప్రియుడు శివకుమార్ ను పెళ్లాడినట్లు తెలిపింది. త్వరలోనే తమ పెళ్లి వీడియో కూడా రిలీజ్ చేస్తామని షాకిచ్చింది ప్రియాంక.

New Update
Priyanka Jain : సారీ చెప్పకుండా పెళ్లి చేసుకున్నాము.. వైరలవుతున్న ప్రియాంక జైన్ పోస్ట్..!

TV Actress : బుల్లి తెర నటి ప్రియాంక జైన్(Priyanka Jain) గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. 'మౌనరాగం' సీరియల్(Mounaragam Serial) తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ తన నటన, అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. మూగ అమ్మాయి పాత్రలో బుల్లితెర ప్రేక్షకులను ఫిదా చేసింది. ఆ తర్వాత జానకి కలగనలేదు సీరియల్(Janaki Kalaganaledu) ద్వారా మరింత పాపులర్ అయ్యింది ఈ అమ్మడు. ఇదే క్రేజ్ తో బిగ్ బాస్ సీజన్ 7లోఅడుగుపెట్టిన ప్రియాంక.. తన ఆట, మాట తీరుతో లేడీ శివంగిగా పేరు తెచ్చుకుంది. ఇది ఇలా ఉంటే ఈ బుల్లితెర బ్యూటీ నటుడు శివకుమార్(Shiva Kumar) తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ త్వరలో పెళ్లి కూడా  చేసుకోబోతున్నట్లు తెలిపారు.

Also Read: Suriya, Jyotika: జిమ్ లో జ్యోతిక, సూర్య పోటాపోటీ వర్కౌట్స్.. షాకింగ్ వీడియో!

సడెన్ గా పెళ్లి చేసుకున్న ప్రియాంక, శివకుమార్

అయితే తాజాగా నటి ప్రియాంక.. తమకు పెళ్లి అయిపోయింది అంటూ షేర్ చేసిన ఓ పోస్ట్ అందరికీ షాకిచ్చింది. రియల్లీ సారీ మీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాము. త్వరలో పెళ్లి వీడియో రిలీజ్ చేస్తాము అని పోస్ట్ పెట్టింది. ఇది చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాకయ్యారు. అదేంటి ఇలా సడెన్ గా పెళ్లి చేసుకున్నారు అని అనుకున్నారు.

Priyanka Jain

ఈవెంట్ లో భాగంగా

కానీ.. తీరా చూస్తే షూటింగ్ కోసం ఆ పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది. ఉగాది(Ugadi) పండగ సందర్భంగా స్టార్ మా లో మా ఇంటి పండగ అనే ప్రోగ్రామ్ జరింగింది. ఇందులో భాగంగా ప్రియాంక, శివకుమార్ పెళ్లి జరిపించారు. ఈ ఈవెంట్ కు సంబంధించిన ప్రోమో కూడా రిలీజ్ చేశారు.

Priyanka Jain w/d Shiva Kumar

Also Read: Brahmamudi Serial : బిడ్డ తల్లి ఎవరో బయట పెట్టిన రాజ్.. కావ్య ఏం చేయనుంది..? దుగ్గిరాల వారసుడిగా కళ్యాణ్ బాధ్యతలు..!

Advertisment
తాజా కథనాలు