Bigg Boss Ashwini: పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ పై రెచ్చిపోయిన అశ్విని..!

బిగ్ బాస్ ఫైనల్స్ తరువాత పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ ఫ్యాన్స్ మధ్య అల్లర్లు జరిగాయి. ఈ అల్లర్లలో తన కారు అద్దాలను కూడా ధ్వంసం చేశారని బిగ్ బాస్ కంటెస్టెంట్ అశ్విని చెబుతోంది. అభిమానం ఉండొచ్చని ఇలా ధ్వంసం చేయడం సరికాదని ఆమె అంటోంది.

New Update
Bigg Boss Ashwini: పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ పై రెచ్చిపోయిన అశ్విని..!

Bigg Boss Ashwini: బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ 7 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ఉత్కంఠ గా ముగిసింది. సీజన్ 7 విన్నర్ ఎవరో కూడా తేలిపోయింది. అమర్ దీప్, పల్లవి ప్రశాంత్, శివాజీ మధ్య జరిగిన టైటిల్ పోరులో ప్రేక్షకుల ఓటింగ్ లో ముందున్న పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. కామన్ మ్యాన్ కేటగిరీలో బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ సీజన్ 7 టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించాడు. సీరియల్ నటుడు అమర్ దీప్ రన్నర్ గా నిలిచాడు.

గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో విజేతను ప్రకటించగానే.. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అన్నపూర్ణ స్టూడియో ముందు హంగామా సృష్టించారు. రన్నరప్ అమర్ దీప్ ఫ్యాన్స్ కూడా స్థూడియో దగ్గరకు చేరుకున్నారు. పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ ఫ్యాన్స్ మధ్య గొడవ మొదలైంది. ఇరువురి ఫ్యాన్స్ మధ్య ఒక్కసారిగా కొట్లాటలు, తోపులాటలు మొదలయ్యాయి. కారు అద్దాలు, బస్సు అద్దాలు పగల గొడుతూ అన్నపూర్ణ స్థూడియో ముందు బీభత్సము సృష్టించారు. రన్నర్ అమర్ దీప్ కారు అద్దాలు పగలగొట్టి.. బయటకు రావాలి అంటూ హంగామా చేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకున్న పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ఇరు వర్గాల ఫ్యాన్స్ ను వెన్నక్కి నెట్టేశారు.

ఈ గొడవలో రన్నరప్ కారు మాత్రమే కాదు గ్రాండ్ ఫినాలేకు హాజరైన ఎక్స్ కంటెస్టెంట్ అశ్విని కారు అద్దాలు కూడా పగలగొట్టారు. ఈ విషయం పై అశ్విని స్పందించింది. తన కారు అద్దాలు పగల గొట్టడం పై పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ పై సీరియస్ అయ్యారు. "ఫ్యాన్స్.. అభిమానం ఉండడం ఒకే కానీ.. మరీ ఇంతలా హర్ట్ చేయొద్దు.. ఇలా చేస్తే మేము ఏమై పోవాలి అంటూ తన బాధను వ్యక్తం చేశారు. తన కారు ముందు, వెనక అద్దాలు పగల గొట్టారని వీడియోలో చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక సామాన్య రైతు బిడ్డ టైటిల్ గెలవడం చాలా మంచిదే.. కానీ ఫ్యాన్స్ ఇలా రచ్చ చేయడం సరైనది కాదని నెటిజన్లు విమర్శిస్తున్నారు.

Also Read: Bigg Boss Finals: బిగ్‌బాస్‌ ఫైనలిస్ట్ అభిమానుల రచ్చ.. కొట్టుకున్న అభిమానులు.. పగిలిన బస్సు అద్దాలు

Advertisment
Advertisment
తాజా కథనాలు