Bigg Boss Day 3: బిగ్ బాస్ అయితే భయపడాలా?

బిగ్ బాస్ హౌస్ లో హౌస్ మేట్స్ కి అప్పుడే టాస్క్ లు స్టార్ట్ అయిపోయాయి. దాంతో పాటు వారి మధ్య గొడవలు కూడా మొదలయాయ్యి. ఇక లేటెస్ట్ గా చుస్తే శివాజీ, బిగ్ బాస్ కె ఎదురుతిరిగాడు. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోత అంటున్నాడు. ఇంకోవైపు నాకు ముద్దు పెట్టాల్సిందే అంటూ తేజ గొడవ చేస్తున్నాడు. మరోవైపు ఈ వారం ఎలిమినేట్ అయ్యేది పక్క ఆమెనే అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.

New Update
Bigg Boss Day 3: బిగ్ బాస్ అయితే భయపడాలా?

Bigg Boss 7 Telugu Episode 3 : బిగ్ బాస్ హౌస్ లో హౌస్ మేట్స్ కి అప్పుడే టాస్క్ లు స్టార్ట్ అయిపోయాయి. దాంతో పాటు వారి మధ్య గొడవలు కూడా మొదలయాయ్యి. ఇక లేటెస్ట్ గా చుస్తే శివాజీ (Shivaji) , బిగ్ బాస్ కె ఎదురుతిరిగాడు. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోత అంటున్నాడు. ఇంకోవైపు నాకు ముద్దు పెట్టాల్సిందే అంటూ తేజ (Teja) గొడవ చేస్తున్నాడు. మరోవైపు ఈ వారం ఎలిమినేట్ అయ్యేది పక్క ఆమెనే అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు 3వరోజు బిగ్ బాస్ ఇంట్లో ఏం జరిగింది.

బిగ్‌బాస్‌ హౌస్‌.. ఇక్కడ బిగ్‌బాస్‌ చెప్పేదే వేదం.. ఆయన చెప్పింది తు.చ తప్పకుండా పాటించి తీరాల్సిందే! కాదూ, కూడదు నా ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తానంటే చెల్లదు. అందులోనూ బిగ్‌బాస్‌కే ఎదురు తిరిగి మాట్లాడటం, అతి చేయడం, బిగ్‌బాస్‌ ఏంటి? ప్రేక్షకులు కూడా సహించరు.కానీ శివాజీ బిగ్ బాస్ కె ఎదురుతిరిగాడు. కాఫీ పౌడర్‌ పంపించలేదని ఫ్రస్టేట్‌ అయ్యాడు శివాజీ. ఆవేశంతో చేతిలో ఉన్న వస్తువును నేలకేసి కొట్టాడు. ఇంకో గంట చూస్తా.. ఎవడికీ భయపడను అంటూ దారిలో ఉన్న బకెట్‌ వంటి వస్తువులను తన్నుకుంటూ పోతూ చిందులు తొక్కాడు. అయినా సరే బిగ్‌బాస్‌ శివాజీని ఏమీ అనకుండా అతడిని కూల్‌ చేసేందుకు ప్రయత్నించాడు. గౌతమ్‌ (Goutham)కు బీపీ మెషిన్‌ ఇచ్చి శివాజీ బీపీ ఎంతుందో చూడమన్నాడు. అయినా సరే, శివాజీ తలపొగరుతో..ఏం బీపీ చూస్తవ్‌..పెట్టక్కడ అంటూ గౌతమ్‌ మీదా అరిచాడు. నీకే బీపీ ఎక్కువైందని బిగ్‌బాస్‌నే తిట్టిపోశాడు. తలుపు తీస్తే మరు క్షణం వెళ్లిపోతానని బిల్డప్‌ ఇస్తూ మాట్లాడాడు.

అప్పటికీ బిగ్‌బాస్‌ (Bigg Boss) కూల్‌గానే మాట్లాడుతున్నాడు. పరిస్థితిని చల్లబర్చాలన్న ఉద్దేశంతో రతికకు ఓ చిన్న పని అప్పజెప్పాడు. స్టెతస్కోప్‌ తీసుకుని అందరి గుండె ఏం చెప్తుందో తెలియజేయాలన్నాడు. కానీ ఆ పని కూడా చేయనివ్వకుండా అడ్డుపడ్డాడు శివాజీ. నేనిక్కడ బాధపడుతుంటే ఆయనకు కామెడీ గా ఉందా? అందరి హార్ట్‌బీట్‌ చూసి ఈ శివాజీగాడిని వదిలేసి పిచ్చోడిని చేయాలనుకుంటున్నాడా? అని కన్నెర్ర జేస్తూ.. నాకు ఈ బిగ్‌బాస్‌ హౌసే వద్దు, తలుపు తీస్తే వెళ్లిపోతా.. అంటూ కోప్పడ్డాడు.

Also Read: బిగ్ బాస్ సీజన్ 7లో సెకండ్ ఎపిసోడ్‌

ఇక ఓ పక్క టాస్కుల్లో ఉత్తేజంగా ఆడుతూనే, మరోపక్క తోటి కంటెస్టెంట్లతో బంధాలు ఏర్పరుచుకుంటున్నారు. ఈ విషయంలో అందరికంటే యమ జోరుగా ఉన్నాడు రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్‌ (Pallavi Prashanth). హౌస్‌లోకి వచ్చిన రెండు రోజుల్లోనే హీరోయిన్‌ రతిక రోస్‌ (Rathika Rose)ను బుట్టలో పడేశాడు. తన మనసే ఇచ్చేస్తానని రతిక అనడంతో ప్రశాంత్‌ సంతోషంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు.టేస్టీ తేజ కూడా ఇలాంటిది తనకేమైనా వర్కవుట్‌ అవుతుందేమోనని ప్లాన్‌ చేశాడు. శుభశ్రీ రాయగురు, తేజను అమ్మాయిలా రెడీ చేసేందుకు రెడీ అయింది. అతడి ముఖానికి మేకప్‌ అ‍ద్ది, పిలకజుట్టు వేసింది. తర్వాత లిప్‌స్టిక్‌ పూస్తుండగా డైరెక్ట్‌గా పెదాలతో లిప్‌స్టిక్‌ వేయొచ్చుగా అని అడిగాడు. తేజ మాటలు విని షాకైన శుభశ్రీ.. అలాంటి పప్పులు ఉడకవంటూ అతడి చెంపపై లిప్‌స్టిక్‌ రుద్దింది.

అయినా సరే తేజ పట్టువిడవకుండా తనకు డైరెక్ట్‌గా లిప్‌స్టిక్‌ కావాలని గోల చేశాడు. దీంతో అక్కడే ఉన్న షకీలా.. ఓస్‌ అంతేనా.. అని అతడి బుగ్గన ముద్దు పెట్టింది. అలా అతడి బుగ్గపై షకీలా లిప్‌స్టిక్‌ మరకలు పడ్డాయి. దీంతో అక్కడున్నవారంతా నవ్వారు. అయితే తేజ తనకు దేవుడిచ్చిన కొడుకు అని చెప్పుకొచ్చింది షకీల.

ఇక నామినేషన్స్ టాపిక్ వచ్చేసరికి..వాళ్లపై వీళ్లు, వీళ్లపై వాళ్లు చాడీలు చెప్పుకొన్నారు. మొత్తంగా శోభాశెట్టి, రతిక, ప్రిన్స్, ప్రశాంత్, కిరణ్, గౌతమ్, షకీలా, దామిని.. నామినేషన్స్ లో ఉన్నట్లు బిగ్ బాస్ ప్రకటించాడు. అయితే వీళ్లలో తొలివారం ఎలిమినేట్ అయ్యేది ఎవరా అని ఇప్పటికే ప్రిడిక్షన్స్ మొదలైపోయాయి.

మరోవైపు నామినేషన్స్‌లో ఉన్నవాళ్లని సేవ్ చేసేందుకు ఓటింగ్ కూడా జోరుగా సాగుతోంది. అయితే లిస్టులో ఉన్న రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్‌కి ఎక్కువగా ఓట్లు పడుతున్నాయి. ఆ తర్వాత స్థానాల్లో వరసగా శోభా, రతిక, గౌతమ్, షకీలా, ప్రిన్స్, దామిని ఉన్నారు. ఇక చివరి స్థానంలో కిరణ్ రాథోడ్ ఉన్నారు. కిరణ్‌కి భాష సమస్య కావడంతో అందరిలోనూ ఈమె ఎక్కువగా కలవలేకపోతుంది. అలా అని ఇప్పుడే ఏం చెప్పలేం. మరి ఈ వీకెండ్‌లో కిరణ్.. ఎలిమినేట్ అవుతుందా ఇంకెవరైనా బయటకెళ్లిపోతారా అనేది చూడాలి.

Also Read: మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీ రివ్యూ

Advertisment
Advertisment
తాజా కథనాలు