Bigg Boss 7 Telugu: దొరికిపోయిన యావర్, ప్రశాంత్.. వైరలవుతున్న వీడియో..!

బిగ్ బాస్ షోలో యావర్, ప్రశాంత్ షోకు ముందు ఒకరితో ఒకరికి పరిచయం లేనట్లు, మొదటి సారి ఇక్కడే కలిసినట్లు చెప్పారు. కానీ బిగ్ బాస్ కు రాకముందే వాళ్ళిద్దరికీ పరిచయం ఉన్నట్లు ఓ వీడియో విడుదలైంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరలవుతుంది.

Bigg Boss 7 Telugu: దొరికిపోయిన యావర్, ప్రశాంత్.. వైరలవుతున్న వీడియో..!
New Update

Bigg Boss 7 Telugu: ఉల్టా పుల్టా కాన్సెప్ట్ తో బిగ్ బాస్ సీజన్ 7 చాలా ఆసక్తిగా ముగిసింది. ప్రతీ సీజన్ లో కంటెస్టెంట్స్ గ్రూప్స్ గా ఉండడం సహజం. అలాగే ఈ సీజన్ లో SPY, SPA బ్యాచ్ ల మధ్యనే షో నడించింది. సీజన్ మొదటి నుంచి అమర్, ప్రియాంక, శోభ ముగ్గురు గ్రూప్ గా గేమ్ ఆడుతున్నారని.. వాళ్లంతా స్టార్ మా బ్యాచ్.. అంటూ శివాజీ ప్రచారం చేస్తూ వచ్చాడు. షోలో నాగార్జునతో కూడా వాళ్ళు ముగ్గురు కలిసి గేమ్ ఆడుతన్నారని చెప్పాడు. వాస్తవానికి ఆ విషయం అమర్, ప్రియాంక, శోభ కూడా ఒప్పుకున్నారు. షోకు ముందు నుంచే తామంతా కలిసి వర్క్ చేశామని.. మంచి స్నేహితులం కూడా అని చెప్పారు.

ఇక  సీజన్ ప్రారంభం నుంచే శివాజీ పల్లవి ప్రశాంత్, యావర్ ఇద్దరికీ సపోర్ట్ చేస్తూ వచ్చాడు. ఇదే క్రమంలో వాళ్ళు ముగ్గురు SPY గ్రూప్ గా అయ్యారు. వీళ్ళు కూడా కలిసి గేమ్ ఆడినప్పటికీ కేవలం SPA బ్యాచ్ మాత్రమే గ్రూప్ గేమ్ ఆడుతున్నారని ప్రచారం చేసేవారు. అమర్, ప్రియాంక, శోభ తాము ముందు నుంచి ఫ్రెండ్స్.. షో కోసం ఏ సంబంధం లేనట్లు నటించలేమని ఓపెన్ గా చెప్పేసారు. కానీ SPY బ్యాచ్ మాత్రం తమకు ముందు నుంచి అసలు పరిచయం లేదు.. ఇక్కడే మొదటి సారి కలిశాం.. ఫ్రెండ్స్ అయ్యాము అని చెప్పారు. ఒక సందర్భంలో యావర్ మాట్లాడుతూ.. ప్రశాంత్ చూడడం ఇదే మొదటి సారి. కనీసం కలవలేదు కూడా అని చెప్పాడు. కానీ ఇదంతా అబద్దం అని తేలింది. వాళ్లకు షో ముందు నుంచే పరిచయం ఉన్నట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ గా మారింది.

publive-image

ఈ వీడియోలో బిగ్ బాస్ షోకు వెళ్లకముందే యావర్, ప్రశాంత్ ఇద్దరు సన్నిహితంగా మాట్లాడుకున్నారు. దీంతో వీళ్లిద్దరికీ ముందే పరిచయం ఉన్నట్లు తేలిపోయింది. ఇది చూసిన నెటిజన్లు జనాలను మోసం చేశారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. శివాజీ కూడా బిగ్ బాస్ కు ముందు ప్రశాంత్ ను ఇంటర్వ్యూ చేయమని ఒక యూట్యూబ్ ఛానెల్ కు సూచించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. SPY బ్యాచ్ నిజంగా షోలోనే మంచి స్నేహితులయ్యారని భావించిన అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది ప్లాన్డ్ గా గేమ్ ఆడారు అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Bigg Boss 7 Winner: నేను గెలిచిన 35 లక్షలు మొత్తం వాళ్ళకే .. పల్లవి ప్రశాంత్ షాకింగ్ కామెంట్స్..!

#bigg-boss-7 #bigg-boss-7-telugu
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి