/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/siri-1-jpg.webp)
Siri Hanumanth: తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఆదరణ ఉన్న బుల్లితెర కామెడీ షో ‘జబర్దస్త్’ (Jabardasth). అయితే, ఈ ప్రొగ్రామ్ కు కొత్త యాంకర్‌ను పరిచయం చేశారు. సౌమ్య రావు(Soumya Rao) స్థానంలో కొత్త యాంకర్‌గా సిరి హన్మంత్(Siri Hanumanth) ఎంట్రీ ఇచ్చింది. తాజాగా విడుదలైన ప్రోమో ద్వారా ఆమెను పరిచయం చేశారు.
సిరి హన్మంత్ ప్రొఫైల్ విషయానికి వస్తే.. పలు సీరియల్స్‌లో నటించి మెప్పించింది. అంతేకాదు బిగ్‌బాస్ సీజన్-5లోనూ (Bigg Boss Season 5) మెరిసింది. హౌస్‌లో ఉన్నప్పుడు యూట్యూబర్ షణ్ముఖ్‌తో ఆమె వ్యక్తిగత స్నేహంపై సోషల్ మీడియాలో చర్చ కూడా జరిగింది. ఈ ఎపిసోడ్‌తో ఆమెకు మరింత గుర్తింపు వచ్చింది. ఇటీవలే బ్లాక్ బాస్టర్ విజయం సాధించిన షారుక్ ఖాన్ ‘జవాన్’ సినిమాలో ఆమె కనిపించింది. ఓ పాత్రలో అలరించింది. ఈ సినిమాతో ఆమెకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది.
కెరీర్ తొలినాళ్లలో షార్ట్ ఫిల్మ్స్ చేసి గుర్తింపుతోపాటు ఫాలోయింగ్ సంపాదించుకున్న సిరి ఇప్పుడు ఏకంగా జబర్దస్త్ అవకాశాన్ని దక్కించుకుంది. మరి కొత్త వేదికపై ప్రేక్షకులను ఎంతవరకు అలరిస్తుందో వేచిచూడాలి.
కాగా బుల్లితెర కామెడీ షో ‘జబర్దస్త్’కు సంబంధించిన యాంకర్లు, జడ్జీలు క్రమంగా మారుతున్న విషయం తెలిసిందే. రోజా, నాగబాబు షోకు తొలుత జడ్జీలుగా వ్యవహరించారు. చాన్నాళ్ల తర్వాత తప్పుకున్నారు. ఆ తర్వాత మను, ఖుష్బూ జడ్జీలుగా వ్యవహరించారు. ఇప్పుడు కృష్ణ భగవాన్, ఇంద్రజ జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. ఇక పలువురు యాంకర్లు కూడా మారిన విషయం తెలిసిందే.
Also Read: వామ్మో.. మంచు లక్ష్మి అందం మాములుగా లేదుగా.!