Bigg Boss Finals: బిగ్‌బాస్‌ ఫైనలిస్ట్ అభిమానుల రచ్చ.. కొట్టుకున్న అభిమానులు.. పగిలిన బస్సు అద్దాలు 

బిగ్‌బాస్‌ ఫైనలిస్ట్ లు అమర దీప్, ప్రశాంత్ అభిమానులు వీరంగం సృష్టించారు. పల్లవి ప్రశాంత్ గెలిచినట్లు తెలిసిన వెంటనే.. ఇద్దరి అభిమానులు ఘర్షణ పడ్డారు. ఈ గొడవలో అమర్ దీప్ కారు, ఒక సిటీబస్సు అద్దాలు బద్దలు కొట్టారు. పోలీసులు లాఠీ ఛార్జీ చేసి అభిమానులను చెదరగొట్టారు 

Bigg Boss Finals: బిగ్‌బాస్‌ ఫైనలిస్ట్ అభిమానుల రచ్చ.. కొట్టుకున్న అభిమానులు.. పగిలిన బస్సు అద్దాలు 
New Update

Bigg Boss Finals: బిగ్‌బాస్‌.. ఉల్టా పల్టా ఆంటూ 105 రోజుల క్రితం కింగ్ నాగార్జున షో మొదలు పెట్టిన దగ్గర నుంచి.. సంచలనగానే సాగుతూ వచ్చింది. బిగ్‌బాస్‌ అంటేనే ఎవరికీ ఏమీ అర్ధంకాని షో. ఎవరు గెలుస్తారు..ఎవరు నిలుస్తారు.. ఎపుడు ఎవరు బయటకు వచ్చేస్తారు వీటి అంచనాలు ఎప్పుడూ తారుమారు అవుతూనే ఉంటాయి. అయితే.. ఈసారి దాదాపుగా నాలుగైదు వారాల ముందుగానే, బిగ్‌బాస్‌ ఎవరు గెలుస్తారు అనేదానిపై అందరూ ఒక క్లారిటీతో అంచనాకు వచ్చేశారు. ఎప్పుడూ లేనిది కామన్ మేన్ ఈసారి గెలుపు అందుకోబోతున్నాడని ముందే అంచనా వేశారు. అంచనాలకు తగ్గట్టుగానే, బిగ్‌బాస్‌ చరిత్రలో తొలిసారిగా కామన్ మేన్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన రైతు కుటుంబం నుంచి వచ్చిన పల్లవి ప్రశాంత్ బిగ్‌బాస్‌ కిరీటాన్ని ఎగరేసుకుపోయాడు. ఆదివారం రాత్రి బిగ్‌బాస్‌ 7 విన్నర్ గా పల్లవి ప్రశాంత్ ని ప్రకటించారు. 

బిగ్‌బాస్‌ 7 సీజన్ విన్నర్ గా పల్లవి ప్రశాంత్ గెలిచిన వెంటనే అతని అభిమానులు అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద హంగామా సృష్టించారు. మరోవైపు రన్నరప్ అమర్ దీప్ ఫ్యాన్స్ కూడా అక్కడకు చేరుకున్నారు. ఈ ఇద్దరు ఫ్యాన్స్ మధ్య ఒక్కసారిగా గొడవ మొదలైంది. అర్ధరాత్రి అన్నపూర్ణ స్థూడియోస్ దగ్గర ఈ ఫ్యాన్స్ హంగామాతో హైటెన్షన్ చోటు చేసుకుంది. అమర్ దీప్ - పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ మధ్యలో ఒక్కసారిగా తోపులాటలు మొదలయ్యాయి. ఈ సమయంలో అమర్ దీప్ కారు అద్దాలు పగిలిపోయాయి. అదే క్రమంలో అక్కడే ఉన్న ఒక సిటీ బస్సు అద్దాలను సైతం ఫ్యాన్స్ బద్దలు కొట్టారు. దీంతో పరిస్థితి అదుపుతప్పుతున్న సూచనలు కనిపించాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు తమ లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. లాఠీలతో ఇరు వర్గాలనూ పోలీసులు వెన్నక్కి నెట్టేశారు. వారిని అక్కడ నుంచి తరిమేశారు. బిగ్‌బాస్‌ చరిత్రలో బిగ్‌బాస్‌ హౌస్ దగ్గర ఈ స్థాయిలో అల్లరి.. హింస చెలరేగడం ఇదే తొలిసారి. ఆటను ఆటలా తీసుకోకుండా ఫ్యాన్స్ ఇలా రచ్చ చేయడంతో అందరూ అవాక్కవుతున్నారు. ఇదేమి పధ్ధతి అని విమర్శిస్తున్నారు. 105 రోజుల పాటు సాగిన బిగ్‌బాస్‌ ఆటలో సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన పల్లవి ప్రశాంత్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడం ఓకే కానీ, ఇలా రచ్చచేయడం సరైనది కాదని అందరూ అంటున్నారు. 

Also Read:  రైతు బిడ్డ రాజయ్యాడు.. బిగ్‌ బాస్‌ చరిత్రలో నెవర్‌ బిఫోర్‌..!

కామన్ మ్యాన్ ఎనర్జిటిక్ షో.. 

ఇక ఈ సీజన్ గెలుచుకున్న పల్లవి ప్రశాంత్ కామన్ మేన్ కోటాలో బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఎంతోకాలంగా బిగ్‌బాస్‌ లోకి వెళ్లాలనే కోరికతో ప్రశాంత్ చాలా ప్రయత్నాలు చేశాడు. యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి.. తన ఊరుకు సంబంధిచిన వీడియోస్ తీస్తూ పాప్యులారిటీ పెంచుకున్నాడు. సోషల్ మీడియా ద్వారా బిగ్‌బాస్‌ షో నిర్వాహకుల దృష్టిలో పాడడం కోసం విపరీతంగా ప్రయత్నించాడు. మొత్తమ్మీద అనుకున్నది సాధించాడు. బిగ్‌బాస్‌ లోకి అడుగుపెట్టాడు. అయితే, ఇప్పటివరకూ బిగ్‌బాస్‌ విన్నర్స్ అందరూ సెలబ్రిటీలే. దీంతో, ప్రశాంత్ కూడా కొద్దికాలం తరువాత బయటకు వచ్చేస్తాడనీ.. చివరి వరకూ కొనసాగడం కష్టం అనీ మొదట్లో అందరూ అనుకున్నారు. కానీ, అందరి అంచనాలనూ తారుమారు చేస్తూ.. బిగ్‌బాస్‌ హౌస్ లో ప్రతి టాస్క్ లోనూ కసిగా ఆడుతూ.. తన ప్రత్యర్థులకు అందనంత రేంజిలో ఓటింగ్స్ సాధిస్తూ.. హౌస్ లో నిలబడిపోయాడు. అయితే, చివరి ఐదు వారాల్లో పల్లవి ప్రశాంత్ ఆటను చూసిన అందరూ.. ఈ సారి విన్నర్ అతనే అనే అభిప్రాయానికి వచ్చేశారు. కానీ, ఎదో ఒక మూల సెలబ్రిటీ కాకపోవడంతో అతనికి అవకాశం రాదేమో అనే అనుమానం ఉండేది. ఆ అనుమానాన్ని బద్దలు కొడుతూ బిగ్‌బాస్‌ చరిత్రలో రికార్డ్ సృష్టిస్తూ కామన్ మేన్ కూడా సెలబ్రిటీ కావచ్చని నిరూపించాడు పల్లవి ప్రశాంత్. 

Watch this interesting video:

#bigg-boss-8 #bigg-boss-finals
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe