/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-2023-11-18T201702.241-jpg.webp)
Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7.. వీకెండ్ ఎపిసోడ్ వచ్చిందంటే.. హౌస్ మేట్స్ లో ఒక టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఈరోజు తాజాగా విడుదలైన వీకెండ్ ఎపిసోడ్ ప్రోమోలో నాగార్జున ఇంటి సభ్యులకు గట్టిగానే క్లాస్ ఇచ్చినట్లుగా కనిపిస్తుంది.
ప్రోమోలో హోస్ట్ నాగార్జున ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ లో యావర్ ఆడిన ఫౌల్ గేమ్ గురించి మాట్లాడుతూ.. యావర్ పై ఫైర్ అయ్యారు. ఫౌల్ గేమ్ కు సంబంధించిన వీడియోలను ఇంటి సభ్యులందరి ముందు ప్రదర్శించి.. ఎంతో కష్టపడి ఎవిక్షన్ పాస్ గెలిచాను.. అని ఫీల్ అవుతున్న.. యావర్ కళ్ళు తెరిపించారు నాగార్జున.
ఈ విషయంలో నాగార్జున.. శివాజీ నిర్ణయం అడగగా.. టాస్క్ లో యావర్ కు సపోర్ట్ చేసిన శివాజీ కూడా.. వీడియో చూసాక.. యావర్ ఫౌల్ గేమ్ ఆడినట్లుగా చెప్పాడు. ఇక నాగార్జున.. "యావర్ గేమ్ ఆడావు కానీ గెలిచే తీరు కూడా కరెక్ట్ గా ఉండాలని గట్టిగా క్లాస్ ఇచ్చారు. తాను చేసిన తప్పు ఒప్పుకున్న యావర్.. ఎవిక్షన్ ఫ్రీ పాస్ పొందడానికి నేను అర్హుడిని కాదని తానే చెప్పాడు. ఈ విషయంలో నాగార్జున ఇంటి సభ్యుల నిర్ణయం తీసుకున్నారు. "ఎంత మంది హౌస్ మేట్స్.. యావర్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ తీసుకోవడానికి అర్హుడు కాదని భావిస్తున్నారో చెప్పండి" అని అడిగారు. ఇక ఇంటి సభ్యుల నిర్ణయం ఏంటో తెలియాలంటే ఎపిసోడ్ చూడాల్సిందే .
Also Read: Bigg Boss 7 Telugu: రతిక ఎలిమినేటెడ్..? ‘ఎవిక్షన్ ఫ్రీ పాస్’ తో ఊహించని ట్విస్ట్..!