Bigg Boss 7 Telugu: ప్రతీ సారి సెంటి మెంట్ డైలాగులు ఏందిరా.. ఏడవకు.. ఆట ఆడి చూపించు..!

బిగ్ బాస్ సీజన్ 7.. నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఇంటి సభ్యులకు చివరి కెప్టెన్సీ టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ ఫైనల్ రౌండ్ వచ్చే సరికి కెప్టెన్సీ రేస్ లో అమర్, అర్జున్ మాత్రమే ఉన్నారు. ఇక వీళ్ళిద్దరిలో ఎవరు కెప్టెన్ అవ్వాలి అనేది శోభ, శివాజీ నిర్ణయం పై ఆధారపడి ఉంది.

New Update
Bigg Boss 7 Telugu: ప్రతీ సారి సెంటి మెంట్ డైలాగులు ఏందిరా.. ఏడవకు.. ఆట ఆడి చూపించు..!

Bigg Boss 7 Telugu:  బిగ్ బాస్ సీజన్ 7.. నిన్నటి ఎపిసోడ్ లో ఇంటి సభ్యులంతా ఫైనల్ కెప్టెన్సీ టాస్క్ లో పాల్గొన్నారు. బిగ్ బాస్..ఇదే చివరి కెప్టెన్సీ టాస్క్ అని చెప్పడంతో హౌస్ మేట్స్ లో కెప్టెన్ అవ్వాలని మరింత ఆసక్తి పెరిగింది. కెప్టెన్సీ కోసం బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఇచ్చిన ఒక టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో.. బజర్ వచ్చిన ప్రతీ సారి ఇద్దరు ఇంటి సభ్యులు రెడ్ మార్క్ పైకి వచ్చి.. డేంజర్ జోన్ లో డిస్ ప్లే అయిన ఇద్దరి హౌస్ మేట్స్ ఫొటోల్లో కెప్టెన్సీ కి అర్హత లేని వారి ఫోటోను కాల్చేసి.. వారిని కెప్టెన్సీ రేస్ నుంచి తొలగించాలని తెలిపారు బిగ్ బాస్.

publive-image

శోభ అనర్హురాలు 

ఈ టాస్క్ ఆడడానికి ముందుగా వచ్చిన ప్రియాంక, గౌతమ్.. డేంజర్ జోన్ లో డిస్ ప్లే అయిన అర్జున్, శోభ ఫొటోల్లో.. శోభ ఫొటోను కాల్చేసి.. అనర్హురాలిగా ప్రకటించారు. దానికి గౌతమ్ చెప్పిన రీజన్.. లాస్ట్ వీక్ కెప్టెన్సీ టాస్క్ లో అమర్, ప్రియాంక ఇద్దరు నీ ఫ్రెండ్స్ కానీ నువ్వు.. కేవలం అమర్ (Amar) కు మాత్రమే సపోర్ట్ చేసి.. నన్ను ప్రియాంకకు సపోర్ట్ చేయకుండా ఆపడం నాకు నచ్చలేదని చెప్పాడు.

publive-image

నన్ను తీసేయడానికి నీకు హక్కు లేదు

ఆ తర్వాత వచ్చిన శోభ- ప్రశాంత్ వచ్చారు. వీళ్లిద్దరి కోసం బిగ్ బాస్ డేంజర్ జోన్ లో అశ్విని, అమర్ ఫొటోలను డిస్ ప్లే చేశారు. ప్రశాంత్ (Pallavi Prashanth), శోభ.. అమర్ కు సపోర్ట్ చేయాలనీ నిర్ణయించుకొని అశ్విని ఫోటోను కాల్చేసి.. అనర్హురాలిగా ప్రకటించారు. ఈ విషయంలో అశ్విని ప్రశాంత్ తో వాదిస్తూ.. శోభ (Shobha) తన ఫ్రెండ్ అమర్ కోసం నన్ను తీసేయడం.. నేను అర్ధం చేసుకుంటా కానీ.. నువ్వు తీసేయడం నాకు బాధగా ఉంది. మొదటి నుంచి నేను.. నీకు సపోర్ట్ చేస్తూ వచ్చాను.. నన్ను తీసే హక్కు అధికారం నీకు లేదని ప్రశాంత్ తో వాదించింది. ఇక ప్రశాంత్ నేను అమర్ కు మాట ఇచ్చాను అందుకే సపోర్ట్ చేస్తున్నాని చెప్పేశాడు.

Bigg Boss 7 Telugu

సెంటి మెంట్ డైలాగులు ఏందిరా.. ఆడి చూపించు

ఇక ఫైనల్ రౌండ్ వచ్చే సరికి కెప్టెన్సీ రేస్ లో అమర్, అర్జున్ మాత్రమే ఉన్నారు. ఇక వీళ్ళిద్దరిలో ఎవరు కెప్టెన్ అవ్వాలి అనేది శోభ, శివాజీ నిర్ణయం పై ఆధారపడి ఉంది. శోభ.. అమర్ కు, శివాజీ అర్జున్ కు సపోర్ట్ చేస్తున్నామని చెప్పారు. ఆ తర్వాత బిగ్ బాస్.. శోభ, శివాజీ (Shivaji) ఇద్దరు ఏకాభిప్రాయంతో ఒకరి ఫొటోను పేరు చెప్పాలని వార్నింగ్ ఇచ్చారు. ఇక అమర్ శివాజీని.. అన్న ఇది లాస్ట్ కెప్టెన్సీ.. అర్జున్ ఒకసారి అయ్యాడు కదా.. నాకు ఛాన్స్ ఇవ్వండని రిక్వెస్ట్ చేస్తూ ఏడ్చాడు. అర్జున్ మళ్ళీ కెప్టెన్ అవ్వాలని.. తన వైఫ్ కోరుకుంది అందుకే తనకు సపోర్ట్ చేయాలనీ ఉంది అని చెప్పాడు శివాజీ. ఆ తర్వాత అమర్ మా పేరెంట్స్, నా వైఫ్ కోరిక కూడా అన్నా.. అని ఎమోషనల్ అయ్యాడు. ప్రతీ సారి ఏడుపు ఏంటి రా... సెంటిమెంట్ డైలాగులు వద్దు.. ఆట ఆడి చూపించు అని అమర్ పై గట్టిగా అరిచాడు శివాజీ. ఇక బిగ్ బాస్ ఎంత సమయం ఇచ్చిన.. ఏకాభిప్రాయానికి రానందున ఇద్దరు ఫొటోలను కాల్చేసి.. కెప్టెన్సీ రద్దు చేశారు.

Bigg Boss 7 Telugu

Also Read: Bigg Boss Manas Marriage: ఘనంగా బిగ్ బాస్ ఫేమ్ మానస్ పెళ్లి వేడుకలు.. సన్నీ, కాజల్ సర్ ప్రైజ్ గిఫ్ట్..!

Advertisment
తాజా కథనాలు