/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/FotoJet-38-1-jpg.webp)
Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 మొదటి నుంచే ఈ సీజన్ అంతా ఉల్టా పుల్టాగా సాగుతుంది. ప్రతి వారం బిగ్ బాస్ ఇంటిసభ్యులకు, ప్రేక్షకులకు ఎదో ఒక షాక్ ఇస్తూనే ఉన్నారు. గత సీజన్ లో ఎప్పుడు జరగనట్లు ఈ సీజన్ లో ఒకేసారి ఐదుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అర్జున్, నయనీ, పూజ, అశ్విని, భోలే ఇంట్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక వచ్చిన 5 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇప్పటికే ఒకరు ఎలిమినేట్ అయ్యారు. ఇక ఈ వారం నామినేషన్స్ లో ఉన్న భోలే, అశ్విని, పూజ, అమర్, గౌతమ్, తేజ, పల్లవి ప్రశాంత్ వీళ్ళ ఐదుగురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారని ఆడియన్స్ లో చర్చ జరుగుతుంది.
వీళ్ళ ఐదుగురిలో ఆన్లైన్ పోల్స్ ప్రకారం పూజ, అశ్విని, భోలే వీళ్ళు ముగ్గురు లీస్ట్ లో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక వీళ్ళ ముగ్గురులో పూజ ఎలిమినేట్ అవుతుందని సోషల్ మీడియాలో వినిపిస్తుంది. అయితే పూజ ఎలిమినేట్ అవ్వడానికి కారణం తన ఈ వీక్ బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లలో తన ఆట ఎక్కడా కూడా కనిపించలేదు.. అలాగే జనాలలో తన ఆట పై అంతగా ఇంప్యాక్ట్ క్రియేట్ చేయలేకపోయిందని ప్రేక్షకులు భావిస్తున్నారు. అందుకే ఈ వారం తను ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని ప్రేక్షకులు అనుకుంటున్నారు.
అశ్విని కూడా లీస్ట్ లో ఉన్నప్పటికీ ఈ వారం అశ్విని ఆటలో గత వారం కంటే కాస్త ఇంప్రూవ్ అయ్యిందని ప్రేక్షకులు భావించారు. అలాగే ఈ వారం టాస్క్ లో బాగా ఆడటంతో పాటు ఫన్ యాంగిల్ కూడా చూపించింది. దాంతో ప్రేక్షకులు అశ్వినికి ఓట్లు వేసే అవకాశం ఉంది కావున అశ్విని ఎలిమినేట్ అయ్యే అవకాశం కూడా తక్కువ అని ప్రేక్షకులు భావిస్తున్నారు.
ఇక ప్రశాంత్, అమర్, గౌతమ్ ఓటింగ్స్ లో టాప్ లో ఉన్నట్లు సోషల్ మీడియా పోల్స్ చెబుతున్నాయి. అందుకని వీళ్ళు ఎలిమినేట్ అయ్యే అవకాశం లేనట్లు తెలుస్తుంది. అంతే కాదు ఈ వారం టాస్క్ లలో బాగా ఆడటంతో పాటు వాళ్ళ ఆట పై ప్రేక్షకులలో ఒక ఇంప్యాక్ట్ క్రియేట్ చేశారు.
సోషల్ మీడియాలో తేజ ఎలిమినేట్ అయ్యే అవకాశం కూడా ఉందని ఒక టాక్ వినిపిస్తుంది. టాప్ కంటెస్టెంట్ గా భావించిన తేజ ఈ వారం అనుకున్నంత బాగా పెర్ఫార్మ్ చేయలేకపోయాడని, అందుకే ఊహించని విధంగా తేజ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని ప్రేక్షకులు అనుకుంటున్నారు.
Also Read: Bigg Boss 7 Telugu Promo: ఊరోడా అంటే తప్పా..? కుండ బద్దలుకొట్టిన నాగార్జున