Bigg Boss 7 Telugu: ఈ వారం "No Elimination"..! కారణమేంటో చెప్పి షాకిచ్చిన నాగార్జున..!

బిగ్ బాస్ సీజన్ 7.. బిగ్ బాస్ నిన్నటి వీకెండ్ ఎపిసోడ్ లో గౌతమ్, అశ్విని ఇద్దరి మధ్య ఎలిమినేషన్ ప్రక్రియ జరిగింది. కానీ చివరిలో నాగార్జున ఈ వారం నో ఎలిమినేషన్ అని చెప్పగానే గౌతమ్, అశ్వినితో పాటు హౌస్ మేట్స్ అంతా షాకయ్యారు.

New Update
Bigg Boss 7 Telugu:  ఈ వారం "No Elimination"..!  కారణమేంటో చెప్పి షాకిచ్చిన నాగార్జున..!

Bigg Boss 7 Telugu:  బిగ్ బాస్ సీజన్ 7.. గతంలో జరిగిన 6 సీజన్స్ తో పోల్చుకుంటే.. ఈ సీజన్ కాస్త డిఫరెంట్ గానే సాగుతోంది. బిగ్ బాస్ ప్రేక్షకులలో ఆసక్తిని పెంచడానికి ప్రతీ వారం ఎదో ఒక ట్విస్ట్ ఇస్తూనే ఉన్నారు. సీజన్ స్టార్ట్ చేయడమే ఉల్టా పుల్టా అనే కాన్సెప్ట్ తో మొదలు పెట్టి  షో పై ఆడియన్స్ లో ఆసక్తిని క్రియేట్ చేశారు. సీజన్ 7 ఉల్టా పుల్టా అన్నట్లుగానే.. నిన్న జరిగిన వీకెండ్ ఎపిసోడ్ లో 'నో ఎలిమినేషన్' అంటూ పెద్ద ట్విస్ట్ ఇచ్చారు బిగ్ బాస్.

ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే నాగార్జున ఇంటి సభ్యులతో జోక్స్ వేస్తూ కాసేపు సరదాగా మాట్లాడారు. ఆ తర్వాత హౌస్ మేట్స్ కు ఒక టాస్క్ ఇచ్చారు. "యాడ్ ఏ ఫ్రెండ్, బ్లాక్ ఏ హౌస్ మేట్". ఈ టాస్క్ లో  ఇంటి సభ్యులంతా.. వాళ్ళు ఎవరిని ఫ్రెండ్ గా భావిస్తున్నారో.. ఎవరిని బ్లాక్ చేస్తారో చెప్పాలని తెలిపారు. మెజారిటీ హౌస్ మేట్స్ గౌతమ్ ను బ్లాక్ చేస్తున్నట్లుగా చెప్పారు.

publive-image

ఈ వారం నామినేషన్స్ లో ఉన్న యావర్, అమర్, రతిక, శోభ, ప్రియాంక, అర్జున్, గౌతమ్ అశ్విని ఎనిమిది మందిలో.. ముందుగా అమర్, అర్జున్, ప్రియాంక, శోభ, యావర్, రతిక సేఫ్ అయ్యారు. ఆ తర్వాత ఇంకా.. నామినేషన్స్ లోనే  ఉన్న గౌతమ్, అశ్విని ఇద్దరి మధ్య ఎలిమినేషన్ ప్రక్రియ జరిగింది. ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవుతారని.. అశ్విని, గౌతమ్ తో పాటు ఇంటి సభ్యులంతా టెన్షన్ గా కనిపించారు. కానీ చివరిలో నాగార్జున ఈ వారం 'నో ఎలిమినేషన్' పెద్ద ట్విస్ట్  ఇచ్చారు.

publive-image

'నో' ఎలిమినేషన్ కు కారణం ఇదే

నాగార్జున.. 'నో' ఎలిమినేషన్ అని చెప్పగానే.. గౌతమ్, అశ్విని  చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడంతో పాటు షాక్ లో ఉండిపోయారు. ఆ తర్వాత నాగార్జున ఈ వారం 'నో ఎలిమినేషన్' ఉండడానికి కారణమేంటో తెలిపారు. యావర్ గెలుచుకున్న "ఎవిక్షన్ ఫ్రీ పాస్" తిరిగి బిగ్ బాస్ కు ఇవ్వడం వల్ల.. మీ ఇద్దరి సేవ్ అయ్యారని చెప్పారు. కానీ నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని ఇంటి సభ్యులకు మరో  షాకిచ్చారు నాగార్జున.

publive-image

Also Read: Bigg Boss 7 Telugu: గౌతమ్ కు షాకిచ్చిన శోభ.. ఆ విషయంలో నాకు నచ్చలేదు..!

Advertisment
తాజా కథనాలు