Bigg Boss 7 Telugu: ఇంట్లోకి అమ్మ రాలేకపోయింది.. అదొక్కటే నా బాధ..!

బిగ్ బాస్ సీజన్ 7 వీకెండ్ ఎపిసోడ్ లో ఎలిమినేట్ అయిన తేజ బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చాడు. స్టేజ్ పైకి వచ్చిన తేజ.. బిగ్ బాస్ ఇంట్లో 9 వారాలు ఉన్నాను చాలా హ్యాపీగా ఉంది. కానీ ఫ్యామిలీ వీక్ లో అమ్మ రాలేకపోయింది.. అదొక్కటే బాధగా ఉందని ఎమోషనల్ అయ్యాడు.

Bigg Boss 7 Telugu:  ఇంట్లోకి అమ్మ రాలేకపోయింది.. అదొక్కటే నా బాధ..!
New Update

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 నిన్నటి ఎపిసోడ్ లో  తేజ ఎలిమినేటెడ్ అని తెలియగానే ఇంటి సభ్యులంతా షాకయ్యారు. నామినేషన్ లో ఉన్న ఎనిమిది మందిలో శోభ, భోలే, ప్రియాంక, అర్జున్, రతిక, అమర్, యావర్ ముందుగా సేవ్ అయ్యారు. చివరిలో మిగిలిన తేజ, రతిక ఇద్దరి మధ్య ఎలిమినేషన్ ప్రక్రియ జరిగింది. ఎలిమినేషన్ ప్రక్రియలో తేజ ఎలిమినేట్ అయ్యి ఇంటి నుంచి బయటకు వచ్చాడు.

publive-image

ప్లీజ్ సార్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి..

చివరిలో తేజ, రతిక మధ్య ఎలిమినేషన్ ప్రక్రియ జరిగింది. దీంతో రతిక.. తనే ఎలిమినేట్ అవుతుందేమో అనే భయంతో ఏడుపు మొదలు పెట్టింది. నాగార్జునతో మాట్లాడుతూ.. సార్ ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. నన్ను పంపించకండి సార్ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది రతిక. ఇక తేజ మాత్రం.. 'రతిక నువ్వు  సేవ్ అవుతావు.. నేనే  ఎలిమినేట్ అవుతాను.. అంటూ రతికకు ధైర్యం చెప్పాడు. తేజ ఊహించిందే జరిగింది. హోస్ట్ నాగార్జున కూడా తేజ్ ఎలిమినేటెడ్ అని  చెప్పేశారు.

నేను ఊహించిందే జరిగింది..

తేజ్ ఎలిమినేట్ అవ్వగానే ఇంటి సభ్యులు కాస్త షాక్ అయినట్లుగా కనిపించారు. ఇక ఎలిమినేట్ అవ్వగానే తేజ శివాజితో మాట్లాడుతూ .. నా విషయంలోనే కాదు.. ఎవ్వరి విషయంలోనైన నా అంచనాలు ఎప్పుడు తప్పు కావు.. నేను ఊహించిందే జరిగిందని చెప్పాడు. తేజ ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు శోభ, అర్జున్, ప్రియాంక ఎమోషనల్ అయ్యారు.

publive-image

ఇంట్లోకి అమ్మ రాలేదు.. అదొక్కటే నా భాద

ఎలిమినేట్ అయ్యాక స్టేజ్ పైకి వచ్చిన తేజ నాగార్జునతో మాట్లాడుతూ.. బిగ్ బాస్ ఇంట్లో నా జర్నీ  4 వారాలే అనుకున్నాను.. కానీ 9 వారాలు ఉన్నాను.  చాలా హ్యాపీగా ఉందని తెలిపాడు. కానీ అమ్మ బిగ్ బాస్ ఇంట్లోకి రాలేదనే ఒక్క భాద తప్ప.. మిగతా  జర్నీ అంతా హ్యాపీగా ఉందని ఎమోషనల్ అయ్యాడు.

publive-image

Also Read: Bigg Boss 7 Telugu Promo: ‘కుక్క తోక వంకర’ అమర్ కు భోలే కౌంటర్..

#bigg-boss #bigg-boss-7 #bigg-boss-7-latest-episode #bigg-boss-7-telugu #bigg-boss-7-telugu-latest-updates
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe