Bigg Boss 7 Telugu: యావర్, శోభ ఎలిమినేటెడ్..? టాప్ 5 వీళ్ళే..!

బిగ్ బాస్ సీజన్ 7 ఈ వారం శోభ, యావర్, ప్రియాంక, అమర్, శివాజీ, పల్లవి ప్రశాంత్ నామినేషన్స్ లో ఉన్నారు. ఈ ఏడుగురిలో ఈ వారం ఎలిమినేట్ అయ్యేదెవరని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులు. ప్రస్తుతం సోషల్ మీడియాలో శోభ ఎలిమినేటెడ్ అనే టాక్ ఎక్కువగా వినిపిస్తోంది.

New Update
Bigg Boss 7 Telugu: యావర్, శోభ ఎలిమినేటెడ్..? టాప్ 5 వీళ్ళే..!

Bigg Boss 7 Telugu:  బిగ్ బాస్ సీజన్ 7.. బిగ్ బాస్ చివరి దశకు చేరుకుంది. హౌస్ లో ఇంకా ఏడుగురు కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. ఈ ఏడుగురిలో కేవలం ఐదుగురు మాత్రమే టాప్ 5 గా ఉంటారు. ఇక ఈ వారం వీకెండ్ ఎపిసోడ్ వచ్చేసింది. దీంతో ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది ఎవరనే చర్చ మొదలైంది. ఈ వీక్ అర్జున్ తప్ప మిగతా ఇంటి సభ్యులంతా నామినేషన్స్ లో ఉన్నారు. నామినేషన్స్ లో ఉన్న శోభ, అమర్, శివాజీ, ప్రశాంత్, యావర్, ప్రియాంక ఉన్నారు. శోభ,యావర్ డేంజర్ జోన్ లో ఉన్నారనే బజ్ సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది.

ఆన్లైన్ ఓటింగ్ ప్రకారం శివాజీ, అమర్, పల్లవి ప్రశాంత్, ప్రియాంక టాప్ లో ఉన్నారు. శోభ, యావర్ డేంజర్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సోషల్ మీడియాలో మరో టాక్ కూడా వినిపిస్తోంది. ఈ వారం లేడీ కంటెస్టెంట్ ఎలిమినేటెడ్ అనే బజ్ నడుస్తోంది. దీంతో శోభ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.

publive-image

కానీ వీరిద్దరిలో శోభ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. శోభ ఎలిమినేట్ అవ్వడానికి చాలా కారణాలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో శోభ పై వస్తున్న నెగటివ్ ట్రోల్స్, ఈ వారం శివాజితో పెట్టుకున్న వాదనలో.. శోభ ప్రవర్తన , గట్టి గట్టిగా అరవడం కొంత మందికి తన పై నెగటివ్ అభిప్రాయం వచ్చే అవకాశం ఉంది. అంతే కాదు ఈ వారం నామినేషన్స్ లో అందరు స్ట్రాంగ్ కంటెస్టెంట్ కూడా ఒక రీజన్. ఇవన్నీ శోభ ఎలిమినేషన్ కు కారణమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఊహించని విధంగా యావర్ కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే గతంలో శోభ.. గౌతమ్ తో నీ కంటే ఎక్కువ రోజులు ఉంది చూపిస్తాను అని శపథం చేసింది. తాను అన్నట్లే శోభకు కంటే ముందే గౌతమ్ ఎలిమినేట్ అయ్యాడు. దీని ప్రకారం తన ఓటింగ్ విషయంలో శోభ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకని ఒక 5% యావర్ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని ప్రేక్షకులు భావిస్తున్నారు.

publive-image

Also Read: Bigg Boss 7 Telugu: ఫన్ గేమ్ కాస్త సీరియస్ అయ్యింది.. గొడవ పడిన శోభ, అమర్..!

Advertisment
తాజా కథనాలు