Bigg Boss 7 Telugu Promo: బిగ్ బాస్ ఇంట్లోకి రతిక ఫాదర్.. సర్ ప్రైజ్ చేసిన బిగ్ బాస్..!

బిగ్ బాస్ సీజన్ 7.. బిగ్ బాస్ ఇంట్లో ఫ్యామిలీ వీక్ సందర్భంగా ఇంట్లోకి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో రతిక ఫాదర్ బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చారు.

New Update
Bigg Boss 7 Telugu Promo: బిగ్ బాస్ ఇంట్లోకి రతిక ఫాదర్.. సర్ ప్రైజ్ చేసిన బిగ్ బాస్..!

Bigg Boss 7 Telugu Promo:  బిగ్ బాస్ సీజన్ 7.. బిగ్ బాస్ ఇంట్లోకి ఈ వారం ఫ్యామిలీ మెంబర్స్ రావడంతో ఇల్లంతా చాలా సందడిగా మారింది. రెండు నెలల పాటు ఫ్యామిలీస్ కి దూరంగా ఉన్న హౌస్ మేట్స్ ఫ్యామిలీ వీక్ కోసం ఎంతగానో ఎదురుచూస్తారు. ఇక బిగ్ బాస్ ఇంట్లో ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్ లో భాగంగా ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్లోకి వచ్చారు. ఇప్పటికే ఇంట్లోకి అందరి హౌస్ మేట్స్ ఫ్యామిలీస్ వచ్చారు.. ఒక రతిక ఫ్యామిలీ మాత్రం రాలేదు. ఇక ఈరోజు తాజాగా విడుదలైన ప్రోమోలో రతిక ఫాదర్ బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చారు.

publive-image

రతిక ఫాదర్ ఇంట్లోకి రాగానే.. రతిక వాళ్ళ నాన్నను చూసి కన్నీళ్లు పెట్టుకుంది. ఇక రతిక ఫాదర్ రాగానే ఇంటి సభ్యులందరినీ పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత రతిక ఫాదర్ ఇంటి సభ్యులతో మాట్లాడుతూ.. " గేమ్ బాగా ఆడాలి.. కప్పు గెలవాలి.. ఎవరికో ఒకరికి అయితే కప్పు ఖచ్చితంగా వస్తుంది కదా.. బాగా కష్టపడాలి" అని చెప్పాడు. ఇక రతికతో తన గేమ్ గురించి కొన్ని సలహాలు ఇచ్చాడు. " అంత బాగానే ఉంది.. ఇంకా గేమ్ బాగా ఆడాలి" అని చెప్పాడు. దానికి రతిక "ఇప్పటి నుంచి గేమ్స్ అన్నీ మంచిగా ఆడతానని" చెప్పింది. బిగ్ బాస్ రతిక కోసం వాళ్ళ ఫ్యామిలీ ఫొటోను పంపి సర్ ప్రైజ్ చేశారు.

publive-image

రతిక ఫాదర్ ప్రశాంత్ తో మాట్లాడారు.. "ప్రశాంత్ బాగున్నావా.. "గేమ్ బాగా ఆడుతున్నావు.. బాగా ఆడాలి" అని చెప్పాడు. ప్రోమో చివరిలో బిగ్ బాస్ 'డీజే టిల్లు' సాంగ్ ప్లే చేయగా.. రతిక ఫాదర్ తో కలిసి ఇంటి సభ్యులంతా డాన్స్ వేస్తూ హ్యాపీ గా కనిపించారు. రతిక ఫాదర్ కూడా అందరితో కలిసి స్టెప్పులు వేస్తూ ఎంజాయ్ చేశారు.

publive-image

Also Read: Bigg Boss Telugu 7 Promo 1: “తగ్గేదే లేదు బిడ్డ”.. బిగ్ బాస్ ఇంట్లోకి పల్లవి ప్రశాంత్ ఫాదర్.!

Advertisment
తాజా కథనాలు