Bigg Boss 7 Telugu Promo: బిగ్ బాస్ స్టేజ్ పై 'దాయి దాయి దామ్మ' పాటకు స్టెప్పులేసిన రాఘవ లారెన్స్..!

బిగ్ బాస్ సీజన్ 7 ఆదివారం ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఈరోజు ప్రోమోలో 'జిగర్తాండ' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రాఘవ లారెన్స్, నాగార్జునతో కలిసి బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేశారు.

New Update
Bigg Boss 7 Telugu Promo: బిగ్ బాస్ స్టేజ్ పై 'దాయి దాయి దామ్మ' పాటకు స్టెప్పులేసిన రాఘవ లారెన్స్..!

Bigg Boss 7 Telugu Promo: బిగ్ బాస్ సీజన్ 7 సండే ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. సండే ఫన్ డే అన్నట్లుగానే ఈరోజు ప్రోమో చాలా ఎంటర్ టైనింగ్ గా కనిపించింది. ప్రోమోలో నాగార్జున మరో స్పెషల్ గెస్ట్ తో స్టేజ్ పైకి వచ్చారు. 'జిగర్తాండ' మూవీ (Jigarthanda Movie) ప్రమోషన్స్ లో భాగంగా రాఘవ లారెన్స్ (Raghava Lawrence), ఎస్​.జె సూర్య (S. J. Suryah) స్టేజ్ పై సందడి చేశారు.

రాఘవ లారెన్స్ డైరెక్షన్ లో 'మాస్', 'డాన్' సినిమాలు చేశారు నాగార్జున. ఇక రాఘవ లారెన్స్ 'మాస్' మూవీలోని నాగార్జున సాంగ్ తో స్టేజ్ పైకి ఎంట్రీ ఇచ్చారు. రాఘవ లారెన్స్ హోస్ట్ నాగార్జునతో మాట్లాడుతూ.. "ఇదే అన్నపూర్ణ స్టూడియోలో నా లైఫ్ మొదలైంది.. ఇప్పుడు హీరో రేంజ్ కి ఎదిగి మీ ముందు నిల్చునందుకు సంతోషంగా " ఉందని తెలిపారు. ఈ సందర్భంగా నాగార్జున ఇంటి సభ్యులకు ఒక టాస్క్ ఇచ్చారు. సాంగ్ ప్లే అవ్వగానే ఆ పాటలోని 'Hook Step' గెస్ చేయాలని చెప్పారు.

Also Read: ఎమోషనల్ పోస్ట్ తో కోహ్లీకు విషెస్‌ తెలిపిన అనుష్క శర్మ.!

publive-image

ఈ టాస్క్ ఆడడానికి ముందుగా ప్రశాంత్ (Pallavi Prashanth), అమర్ (Amar) వచ్చారు. వీళ్ళ కోసం బిగ్ బాస్ 'దాయి దాయి దామ్మ' సాంగ్ ప్లే చేయగా.. ప్రశాంత్ గెస్ చేసి ఈ సాంగ్ లోని 'Hook Step' వేశాడు. ప్రశాంత్ 'Hook Step' చూసి.. బాగా చేశావు కానీ కింద నుంచి పైకి వేయాలి  కదా .. నువ్వెంటి పై నుంచి కిందకు వేశావు అంటూ ఫన్ చేశారు రాఘవ లారెన్స్.

Bigg Boss 7 Telugu

ఆ తర్వాత స్టెప్ గెస్ చేయడానికి  అమర్, గౌతమ్ వచ్చారు. వీళ్ళ కోసం చిరంజీవి 'హిట్లర్' మూవీలోని 'నడక కలిసిన నవ రాత్రి' సాంగ్ ప్లే చేశారు. ముందుగా బెల్ కొట్టిన గౌతమ్.. ఈ సాంగ్ లోని 'Hook Step' గెస్ చేయలేకపోయాడు. దానికి బదులు మరేదో స్టెప్ వేసే సరికీ హౌస్ మేట్స్ , నాగార్జున అందరూ ఫన్నీగా నవ్వుకున్నారు.  తర్వాత నాగార్జున .. అమర్ ను గెస్ చేయమని అడగగా.. అమర్ గెస్ చేసి కరెక్ట్ స్టెప్ వేశాడు. అమర్ డాన్స్ చూసి లారెన్స్.. పర్ఫెక్ట్ స్టెప్ అంటూ పొగిడారు.

Bigg Boss 7 Telugu

నెక్స్ట్ నాగార్జున.. తేజను ఉద్దేశించి.. మాస్టర్ నేను..మీకు ఒక గొప్ప డాన్సర్ ను పరిచయం చేస్తానని చెప్పారు. ఈ స్టెప్ చాలా ఉపయోగపడుతుంది.. ఇది మా తేజ సిగ్నేచర్ స్టెప్ అంటూ ఫన్ చేశారు. ఇక తేజ కోసం ఆంధ్రావాలలోని 'నై రే నై రే' సాంగ్​ వేశారు. ఈ సాంగ్ లో తేజ తన బీభత్సమైన స్టెప్పులతో అందరిని ఫుల్ గా ఎంటర్ టైన్ చేశాడు. తేజ డాన్స్ చూసి రాఘవ లారెన్స్ ఈ స్టెప్స్ నా నెక్స్ట్ మూవీలో వాడుకుంటానని తేజను ఆటపట్టించారు. ప్రోమో అంతా చాలా వినోదాత్మకంగా ముగిసింది.

Bigg Boss 7 Telugu

Also Read: బిగ్ బాస్ ఇంట్లో హీరో కార్తీ.. ఇది ర్యాగింగ్ లా ఉందిఅన్నయ్య..!

Advertisment
తాజా కథనాలు